కలవరం

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

 కలవరం

రచయిత :: జయకుమారి

ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇంత గట్టిగా పెట్టుకున్నావ్, వదులు, నేను వెళ్లిపోవాలి.

హా.. హా.. పట్టుకున్నది వధలడానికా పట్టుకున్నది నిన్ను నాతో తీసుకుని వెళ్ళడానికి.

నేను రాను, నువ్వు వెళ్లిపో ..
అమ్మా.! అమ్మా.! భయం వేస్తుంది.
డాడీ నన్ను కాపాడండి.
ఎవరు నిన్ను కాపడేది వీళ్లా.!
నిన్ను చంపేసి నా దగ్గరకు పంపేది వీళ్ళే.
నీకు అర్థం కావడం లేదు.
నువ్వు ఆడ పిల్ల గా పుట్టావ్,అది నీ తప్పు.
నిన్ను అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకొని ,నిన్ను పీల్చి పిప్పు చేసి ,నిన్ను మానసికంగా చంపిచంపి నిన్ను నేలకొరిగే విధంగా చేస్తారు.
అందుకే చెబుతున్నా నువ్వు ఇప్పుడే వచ్చేయి నాతో.!
నీ అస్థిత్వాన్ని పోగొట్టుకొని నలుగురిలో అవమాన పడి చనిపోయే కన్నా ఇప్పుడే వచ్చేయి.

అమ్మా ఏడుస్తున్న పట్టించుకోరు ఏమిటి?
నాకు భయం వేస్తోంది.
నన్ను వదులు అని అరుస్తూ, పరిగెడుతుంది కానీ పరిగేట్టలేకపోతుంది.
అమ్మా అని గట్టిగా అరుస్తుంది.
చిన్నూ చిన్నూ ఏమైంది రా.!
అలా ఏడుస్తున్నావ్!
కల వచ్చిందా.!
ఇలా చూడు అమ్మ వచ్చింది.!
అని ఏడుస్తున్న కూతురిని ఓదారుస్తుంది. కానీ చిన్నూ మాత్రం భయంతో వణికిపోతోంది.
అమ్మ నన్ను చంపకండి,ఆ అంటీ నన్ను తనతో తీసుకువెళుతుంది అంట. నేను తనతో వెళ్ళాను.
చిన్నూ నువ్వు బయపడకు రా మేము వున్నాం కదా అని నెమ్మదిగా నిద్రపుచ్చుతుంది.
కానీ కూతురులో ఈ వింత ప్రవర్తనకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు శ్రీను,అను కి.

రోజు రోజు కి చిన్నూ పరిస్థితి దిగజరుతుంది.
అవే కలవాట్లు, భయం,!
ఎన్ని ఆసుపత్రిలు తిప్పిన ప్రయోజనం లేకపోయింది.
చిన్నూ అద్దరాత్రి లేచి గట్టిగా అరుస్తూ జుట్టు పీక్కుంటూ కేకలు పడేతుంది.
ఇల్లు అంతా కల తీరుగుతూ అన్ని చిందర వందర చేస్తుంది.
అలా చేస్తూ చేస్తూ ఒక్కసారే కుప్పకూలిపోతుంది.
ఎవరో చెప్పారు రామపురంలో భూతవైద్యుడు వున్నాడు అతని దగ్గరకి వెళదాం అని.అతనితో మాట్లాడి ఇక్కడికి తీసుకునివద్దము అని.
చిన్నూ పరిస్థితి మాత్రం ఏమి మారకపోవడం ఎందుకో భయం గా ఉంది అని ఆ బూతవైద్యుడితో చెబుతారు.
అతను పూజలో చిన్నుని కూర్చో బెడతాడు.
తనకి జరిగింది అంతా చిన్నూ తో చేపిస్తాడు.
చిన్నూ అంతలో స్పృహ కోల్పోవడం తో తనని తీసుకువేల్లే క్రమంలో చిన్నూ చేతిలోంచి ఒక ఫోటో పడుతుంది.
దాన్ని చూసి ఇది ఎవరిది అని అడుగుతారు.
ఇది మా అక్కడి తను చనిపోయింది.
అని చెబుతాడు శ్రీను.
ఎందుకు అని అడిగితే సమాధానం చెపోయాకపోవడం తో, సరే నేను తెలుసుకుంటా అని, చిన్నూ పరిస్థితి కి కారణం మేనత్త అని తెలుసుకుని.
ఆమె చనిపోవడానికి కారణం తెలుసుకొని ఆశ్చర్యాన్ని కలుగిస్తుంది.
ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం తెలుస్తుంది.
ఆ వైద్యుడు చిన్నూ ని వదిలి వెళ్ళమని ఆ ఆత్మ ని కోరతాడు. ఆ ఆత్మ నేను ఎందుకు చనిపోయానో అందరికి తెలిసేలా చేస్తే నేను వెళ్లిపోతాను.
నా కథ ప్రతి ఆడపిల్ల కి గుణపాఠం గా మారాలి.
దానికి ఒప్పుకున్న వైద్యుడి.
శ్రీను ని పిలిచి అసలు విషయం చెబుతాడు.
శ్రీను భయం తో వణికి పోవడం చూసి.
చెప్పు లేకపోతే నీ కూతురు ప్రాణాలతో ఉండదు.
అనగా వద్దు చెబుతా అని జరిగినది.
తాను చేసిన తప్పు ఒప్పుకుంటాడు.
తను వయస్సులో వున్నప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పు ఒప్పుకుంటాడు.
సొంత అక్క అని చూడకుండా తను బట్టలు మార్చుకుంటున్న ఫొటోలు తీసి ఎవరికో పంపితే అది అతను ఫేస్బుక్ లో పెట్టాడు.
అది ఎవరి ద్వారానో తెలుసుకోన్న మా బావ తనే ఎవరితో నో వివాహేతర సంబంధం పెట్టుకుంది అని అవమానించారని ,ఎంత చెప్పినా అక్క మాటలు పాటించుకోలేదు.
ఆ విషయం పై ఊరి జనంతో పాటు,ఇంట్లో వాళ్ళు అనే మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
అప్పుడు ఈ తప్పు నా వల్ల జరిగింది అని చెబితే ఏమి జరుగుతుందో అని చెప్పలేదు.
కానీ జరిగిన తప్పుకు అక్క బలి కావడం, నేను తట్టుకోలేక పోతున్నా,అక్క అప్పుడే చనిపోయింది. కానీ నేను రోజు ప్రతి క్షణం నరకం చూస్తున్న అని ఏడుస్తాడు.
అప్పుడు వైద్యుడు మనం చేసిన తప్పు మన పిల్లని వెంటాడుతోంది. చూసావా శ్రీను ఎలా జరిగిందో నువ్వు చేసిన తప్పు కి ఎన్ని ప్రాణలో అని .
ఇప్పుడు ఈ తప్పు అందరిలో ఒప్పుకొని మీ అక్క ను వేసుకో క్షమించమని ,నీ పిల్లను వదలమని.
అలగే శ్రీను అక్కను క్షమించు అని కోరగా.
ఎరా సొంత వాళ్ళ దగ్గరే అమ్మయి కి రక్షణ లేకపోతే సమాజంలో ఎలా బ్రతుకుతుంది రా నీచుడ.
కానీ నీలా నేను మనస్సులేని దాన్ని కాదు.
అక్క నైనా అమ్మ లా నిన్ను పెంచాను,ప్రేమించాను. నిన్ను చంపాలి అనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని.
శ్రీను నన్ను మన్నించు అక్క.
అనగానే చిన్నూ ని వదిలి వెళ్ళిపోతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!