మానవత్వం

మానవత్వం

రచన. :: సుశీల రమేష్. M.

రహదారులు రక్తపుటేరులై
చావుబతుకుల్లో
కొట్టుమిట్టాడుతున్న
ప్రాణం చేసే ఆర్తనాదం వినని
నరులు స్వీయ చిత్రాల కై
ఆరాటపడే వైఖరి శోచనీయం.
సాయం చేసే తాహతున్నా
సాయపడని మనసును
ఏ పేరుతో పిలువను
కులం మతం ముసుగులో
కన్న బిడ్డలను కడతేర్చే
కసాయి తల్లిదండ్రులను
ఏమని పిలువను
ఎటువైపు చూసినా నాది
నేను అనే స్వార్ధ జీవితాలు
మనది మనం అనే మాట
మరచిన మానవత్వం లేని
ఈ మనుషుల పయనం
ఎటువైపు పోతుంది
మానవత్వమా నీవు లేని
జనారణ్యం నాకు
ఎడారి ని తలపించుచున్నది.

****** సమాప్తం******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!