నీ ప్రేమగా
రచన::జ్యోతిరాణి
నువ్వు ఒక అందమైన అద్భుతం
నీ నవ్వు నాలో రేపే ముత్యాల హరివిల్లు
నీ మాటలు నా హృదయంలో
మూటగట్టుకున్న బంగారునిధులు
నీ చూపులు నాకై వెతికే
ఆరాటపడే చురుకైన బాణాలు
నీ ప్రతి ఆలోచన నాతో
మొదలై నాతో అంతమై
అణునిత్యం నాకు దగ్గరచేసే
ప్రేమ సోపానాలు..
నువ్వు ఒకరితో పోలిక ఉండదు
నీతో నీవుగా నన్నుప్రేమించిన
నన్నును నేను కూడా
ప్రేమించలేనేమో అనేంతగా
ప్రేమించి లాలించి బుజ్జగించిన నీవు
రెప్పపాటున పైకి ఎగురవేసిన బిళ్ళ మాదిరి
బొమ్మగా ఉన్న నువ్వు బొరుసుగా
తిరిగొచ్చి ప్రతిమాటలో చూపులో
నీ ఆలోచనలలో నన్ను పరాయివాన్నిచేస్తే
పొత్తిలల్లో ఉన్న చంటిబిడ్డని
తల్లి వద్దని వెళ్తే విలవిల లాడిన
చంటిబిడ్డ మనసు తో పోల్చుకోనా
ప్రియతమా…
అయినాకూడా ఎన్నటికైనా
నీ ప్రేమగా ఉండిపోనా…
***