చెడుగాలే వీస్తోంది!

చెడుగాలే వీస్తోంది!

రచన :: వాడపర్తి వెంకటరమణ

మనిషి చేస్తున్న వికృత చర్యలకు
ఇప్పుడు చెడుగాలే వీస్తోంది!

పచ్చదనంపై పగబట్టి
తరువుల్ని అడవుల్ని నరికి
నామరూపాలు లేకుండా చేస్తున్న
మనిషి మూర్ఖత్వానికి
ఇప్పుడు చెడుగాలే వీస్తోంది!

త్రాగే జలాలను వ్యర్థాలతో నింపి
నదుల్ని కాలువల్ని సైతం
కక్షబూని కలుషితం చేస్తున్న
మనిషి అవివేకానికి
ఇప్పుడు చెడుగాలే వీస్తోంది!

పరిశుభ్రతను కాలరాసి
పబ్బులనీ పార్టీలనీ
విశృంఖలత్వమే పరమావధిగా
మనిషి చేస్తున్న హేయమైన బుద్ధికి
ఇప్పుడు చెడుగాలే వీస్తోంది!!

***

You May Also Like

One thought on “చెడుగాలే వీస్తోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!