నెలవు…నీవు
రచన::డా!! బాలాజీ దీక్షితులు పి.వి
కన్నులా అవి….
మధువొలికే వలపు గిన్నెలు…!
చూపులా అవి….
చల్లని పవనాలు వీచే పున్నమి కిరణాలు…!
వంపులా అవి
ఎగిరొచ్చే తూర్పు సంద్రపు కెరటాలు…!
పొంగులా అవి
పొంగొస్తున్న రతి కలశాలు …!
సొగసులా అవి
సడిచేసే హృదయ వీణా రావాలు
నా భావ మదిని దోచి
మత్తు ఎక్కించే కవ్వింపుల నెలవు…నీవు !!!!
***