దైవానుగ్రహం

దైవానుగ్రహం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

   అనసూయమ్మ గారికి పూజలు పునస్కారాలు పుట్టుకతో అబ్బి నవి, రోజూ ఉదయమే “నాలుగు గంటలకే లేచి స్నానమాచరించి దైనందిక జీవితం లో దేవుడు గది ని పూలతో అలంకరిస్తూ శబ్దాలు రాకుండా ఎక్కడ భర్త, తన ఇద్దరు పిల్లలు లేచిపోయి విసుకుంటూ రేమో నన్న భయంతో పూజకు అన్ని సమకూర్చుకునేది. ఆరోజు కూడా ఉదయమే లేచి భర్త రాఘవయ్య గారి జన్మదిన సందర్భంగా పూజ గదిలో ‘శుక్లాం బరదరం ‘అంటూ ప్రారంభించి, ‘శ్రావణ శుక్రవారం’ కనుక “లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు”చదువుతూ పూజ లు చేస్తూ తన సంసారం లో ఒడిదుడుకుల ను తగ్గించి శాంతిభద్రతలు, ఆయురారోగ్యాలు కోసం శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన వస్తువులన్నీ సర్దుకునే సరికి చాలా సమయం అయిపోయింది. ఇంతలో భర్త రాఘవయ్య గారు లేచి బిగ్గరగా అనసూయ ‘ఏం చేస్తున్నావే? కాసిని కాఫీ చుక్కలు పొయ్యవే, అరగంట నుండి చూస్తున్నాను, నీ చాదస్తంతో చస్తున్నాను, కాసేపు ఆ పూజలు ఆపి రావే, అన్న  అరుపులు వినబడే సరికి కంగారుగా వస్తున్నా నండి అంటూ తన మడి చీర ఎగ్గట్టి పరుగు పరుగున కిచెన్ లోకి వచ్చి ‘ఫిల్టర్ డికాషన్ ‘తో స్ట్రాంగ్గా కాఫీ తయారు చేసి తన ముఖానికి నవ్వు పులుముకుంటూ “జన్మదిన శుభాకాంక్షలు” అండి,  ప్లీజ్ కొంచెం తొందరగా తాగి స్నానం కానీయండి, పురోహితుడు వచ్చేస్తాడు మన ఇంట్లో ఇవాళ “శ్రీ సత్యనారాయణ స్వామి” వారి వ్రతం ఉన్నది గనుక తయారు కండి, అని అనసూయమ్మగారి అనేసరికి” ఏమే, నీకు ఎన్ని సార్లు చెప్పాను, కిందటి నెల ‘రుద్రాభిషేకం చేయించావు, ఆ కిందటి నెల గణపతి హోమం చేయించావు, ఇలా నీ చాదస్తంతో ఇల్లుని గుడి లా చేస్తున్నావు, ఖర్చులు పెరిగిపోతున్నాయి పిల్లలు స్కూలు ఫీజులు కోసం, బ్యాంకు అప్పులు తీర్చడం కోసం రాత్రింబగళ్ళు నేను పని చేస్తుంటే నువ్వేమో నీ పూజలు, పురోహితులకు దక్షిణాలు, అవిగాక వారంలో సోమవారం శివాలయంకు, మంగళవారం రాముడు కోవెలకు, గురువారం బాబా గుడికి, శనివారం వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు నాకు సమయం లేకున్నా నీకోసం వస్తున్నాను. ఇవన్నీ చేయాలంటే ఎంత డబ్బు, సమయం కావాలో నీకు తెలియదా? నీ భక్తి నీ వరకు ఉంచుకో, నన్ను వేధించకు” అంటూ చిరాకు పడ్డారు రాఘవయ్య గారు.”అయ్యో అదే ఎన్టండీ అలా అంటారు? నాకు మాత్రం తెలియదా, ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా “శ్రీ సత్య నారాయణ స్వామి ” వ్రతం అనుకున్నాను, శ్రావణ శుక్రవారం మంచి రోజు కదా అని ఆలోచించి చేస్తున్నాను, దీనివల్ల మన సంసారంలో సుఖ శాంతులు ఆయురారోగ్యాలు పిల్లల భవిష్యత్తు అన్ని సాఫీగా సాగే టట్లు పరమాత్ముడు మనల్ని ఆశీర్వదిస్తారని చేస్తున్నాను, అలా చిరాకు పడకుండా లేచి తయారు కండి, అని ప్రాధేయ పడుతున్నా భార్యను చూ స్తూ ఒకింత మెత్తబడి బాత్రూమ్ లోకి దూరారు రాఘవయ్య గారు. బెడ్రూంలో పడుకొనివున్న పిల్లల్ని లేపుతు “లేవండ్రా! ఇవ్వాళ్ళ మీ నాన్నగారి పుట్టిన రోజు, మన ఇంట్లో ‘శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉనాాయి, వేదవల్లార! నిన్న అన్ని చెప్పాను కదా మర్చిపోయారా, లెండి తొందరగా తయారై రండి, ఆ తర్వాత స్కూల్ కూడా వెళ్ళాలి, అని గట్టిగా అరిచేసరికి కొడుకు శేఖర్, కూతురు పద్మ ఒక్క ఉదుటున లేచి వెళ్ళి “నాన్నగారు హ్యాపీ బర్త్ డే”అంటూ స్నానాలు చెయ్యడానికి పరుగుల పెట్టారు. ఆ రోజు ఎంత చికాకుగా ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎట్టి ఒడుదుడుకులు లేకుండా ఘనంగా  జరిగేసరికి అనసూయ ఆనందపడుతు, ఏమండీ! ఇవాళ ఎలాగో సెలవు పెట్టారు కదా, పిల్లల్ని స్కూల్ కి దిగబెట్టి రండి, మీకు నచ్చిన స్వీటు, మంచి వంట చేస్తాను, మా ఆయన బంగారం అంటూ చిలిపిగా అంటున్న భార్య పక్క చూసి నవ్వుతూ పిల్లలతో బయలుదేరుతు సరేలే ! నీ దయవల్ల మంచి తిండి, ఆ దేవుడి దయ వల్ల ప్రమోషన్ వస్తే చాలు ఒక్కటేమిటి అన్ని వ్రతాలు చేస్తాను”, అని కొంటెగా నవ్వుతూ అనేసరికి అనసూయ కి సర్రున కోపంతో ‘అదే ఏంటండీ? ఆ దేవుడి మీద పరిహాసాలు ఆయన మీద భక్తి ఉంటే అన్నీ అవే సమకూరుతాయి, ఇది నా చాదస్తం అనుకోని నన్ను తిట్టండి, కానీ నా దేమడ్ని ఒక్క మాట అన్నా నేను సహించను’ అంటూ కిచెన్లోకి పరిగెత్తి పిల్లలకు స్వామివారి ప్రసాదం, పులిహోర బాక్సులో పెట్టి వాళ్లని స్కూలుకి సాగనంపింది అనసూయ.
అలాగే ఆరోజు సంతోషంగా భార్యాభర్తలిద్దరూ మంచి రుచిగా చేసిన “గుత్తి వంకాయ కూర, కొబ్బరి మామిడి కాయ పచ్చడి, ముక్కల పులుసు, అప్పడాలతో ఎంతో రుచిగా ఉన్నా భోజనం లొట్టలు వేసుకుంటూ ఎంతో తృప్తిగా భోంచేసారు. ఆ తర్వాత అలిసిపోయిన భార్యాభర్తలు ఇలా పడుకొనేసరికి అలా మత్తుగా నిద్రలోకి జారిపోయారు. సరిగ్గా నాలుగు గంటల సమయానికి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చి ఎంత తలుపు తట్టిన నిద్రలో ఉన్న తల్లిదండ్రులకు వినపడలేదు, శేఖర్ కు అర్థం కాక పెరట్లో ఉన్న తలుపు తీసి ఉన్నదేమోనని చూసిన అది గడి పెట్టి ఉండడంతో కిటికీ తలుపులు కొంచెం నెట్టి చూసేసరికి ఏదో ఘాటయిన వాసన ఒక్కసారి పైకి వచ్చి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు, వెంటనే చెల్లితో పెరట్లో ఉన్న ఒక పొడుగాటి కర్రని తెమ్మన్నాడు, అతి కష్టం మీద పెరటి గుమ్మం గడియ తీసి మెల్లిగా చెల్లితో నువ్వు వెళ్లి ఇంటి నిండా గ్యాస్ వాసన వస్తున్నది మొత్తం ఇల్లంతా కమ్మేసింది నువ్వు అన్ని తలుపులు తీసి ఏ లైట్ సెల్లు ఆన్ చేయకుండా ఓపెన్ చెయ్యు అని పరిగెత్తుకుంటూ అమ్మానాన్నల బెడ్ రూమ్ కి వెళ్లి ఆ ఇద్దరినీ గట్టిగా కుదిపి లేపే సరికి ఉలిక్కిపడి లేచిన అనసూయ ఏంట్రా ఎప్పుడు వచ్చావ్ ఎలా వచ్చావ్ అంటూ అయోమయంగా ఘాటైన వాసన ఇల్లంతా ఉండ సిలిండర్నుడంతో ఏవండీ గ్యాస్ లీక్ అయినట్టుంది. అయ్యో నా మతి మండా పడుకునే ముందు పాలు పెట్టి మర్చిపోయాను అవి పొంగిపోయి స్టవ్ ఆరి పోయినట్టే ఉంది మీరు వెళ్లి కిచెన్ లో ముందు స్టవ్ కట్టేయండి అని గాభరాగా చెప్పేసరికి రాఘవయ్య గారు కూడా ఆశ్చర్యపోతూ కిచెన్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ ని కట్టేశారు. శేఖర్ తల్లిదండ్రులను చెల్లెను ఏ కరెంట్ స్విచ్ ఆన్ చేయకుండా, మొబైల్ లో మాట్లాడనీయకుండా జాగ్రత్తగా అన్ని తలుపులూ తీసేసి బయటకు తీసుకు వచ్చేశాడు, అప్పటికే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఏదో వాసన వస్తుంది అంటూ కంగారుగా అనసూయమ్మ గారి ఇంటి దగ్గర చూస్తున్నారు. అలా కొంత సేపటికి అంతా సద్దుమణిగి ఇంట్లో ఉన్న ఘాటైన గ్యాసు వాసన పోయిన తర్వాత అది ఎలా జరిగింది అని చుట్టుపక్కల వాళ్ళు అడగడంతో ఏం లేదండి, ఇవాళ అ నేను శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశాను, పిల్లల్ని బడికి పంపి వంట చేసి భోజనం అయిన తర్వాత పాలు కాచడానికి స్టవ్ వెలిగించి మర్చిపోయాను, మేమిద్దరం గాఢనిద్రలో పడిపోయాము, నిజంగా సత్యనారాయణ స్వామి నా పిల్లల తోటి అన్నీ చేయించి మమ్మల్ని మా సంసారాన్ని కాపాడాడు ఇది నిజంగా “దైవానుగ్రహమే” అని అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు చెప్తున్నా అనసూయను ఓదారుస్తు “నిజంగా, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు “ఏది, ఏమైనా మీ పిల్లలు చాలా సమయస్ఫూర్తి ప్రదర్శించి ఎంతో తెలివితేటలతో మీ ఇంటిని కాపాడారు” అని  నవ్వుతూ అందరూ చప్పట్లు కొట్టే సరికి రాఘవయ్య గారు ఎంతో ఆనందంతో పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఆ “సత్యనారాయణస్వామి” వారికి కృతజ్ఞతలు అర్పించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!