నీ స్నేహమే…! నాకన్నీ…..!!

నీ స్నేహమే…! నాకన్నీ…..!!!

రచన: నాగ రమేష్ మట్టపర్తి

నా అజ్ఞానాంధకారానికి
జ్ఞానజ్యోతి ప్రకాశం  ” నీ స్నేహం “…

నా కన్నీటిని పన్నీటిగా మార్చే
మహేంద్రజాలం ” నీ స్నేహం “…

నా నిర్జీవాధరములపై చిగురించే
చిరునవ్వు  ” నీ స్నేహం “…

నా విసుగుగొందిన వీనులకు
వసంతగానం  ” నీ స్నేహం “…

నా హృదయంలో వేదనలకు
దివ్యౌషధం  ” నీ స్నేహం “…

నా కష్టనష్టాల జీవితానికి
సహభాగస్వామ్యం  ” నీ స్నేహం “…

నా మోడుబారిన జీవితానికి
నవ వసంతం  ” నీ స్నేహం “…

నా సమస్త విజయాలకు
మూలాధారం  ” నీ స్నేహం “…

సకలైశ్వర్యములు సమృద్ధిగా  ” ఉన్నా “…!
” నీ స్నేహం ”  లేని నా జీవితం  ” సున్నా “…..!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!