ప్రళయకాల విధ్వంసం

ప్రళయకాల విధ్వంసం

రచన:సావిత్రి ప్రసాద్ గునుపూడి

ప్రచండంగా హోరెత్తే ప్రళయకాల విధ్వంసం.
ఆపగల వారెవ్వరు…
ప్రకృతే పగబడితే…
ఉరుకుల తో పరుగులతో పరుగెత్తే జలతరంగిణి.
ఉగ్ర రూపం అమ్మమ్మో విలయతాండవమే అది.
తాళలేని ప్రాణికోటి మ్రొక్కెoదుకు గుడికెళ్తే,
గుడిలోనూ వరదాయే.
పంటలన్నీ నీట మునిగి అన్నదాత కంటి వరకు ప్రవహించే,
ఆకలిదప్పులతో ఆహార పొట్లాల కై ఎదురుచూసే.
వడివడిగా ఉరుకుతూ మ్రోగించే మరణ భేరి.
తాళ లేము దేవా!
ఆకాశము అల్లరి నాపవా.
డ్యాములన్ని చేతులెత్తె,
కరకట్టలు గట్టుదాటె,
వంచనతో వంతెనలు కుప్పకూల,
దిక్కేది ప్రాణికోటికి,
మొక్కేది ఇంకెవరిని.
తుఫానులకు తుళ్ళిపడిన
నగరాలే చెరువు లాయే,
వరదల్లో కొట్టుకుపోయి జనజీవనం కనుమరుగయ్యే.
ప్రచండంగా హోరెత్తే ప్రళయకాల విధ్వంసం.
ఆపగల వారెవరు ప్రకృతే పగబడితే…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!