ముదావహం

ముదావహం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :డా ॥ భరత్ కుమార్ ఉప్పులూరి

ఓ వర్ష కాలపు సాయంత్రం, ఆకాశం అంతా ముసురుతో నిండిపోయింది. భరద్వాజ ఆఫీస్ లో బిజీగా ఉన్నాడు. మాటి మాటికి గడియారం వంక చూస్తూ ఉన్నాడు. చేయాల్సిన పని ఇంకా చాలా మిగిలిపోయింది. ఓ పక్క రైలు బయల్దేరే సమయం దగ్గర పడింది. ఆఫీస్ నుండి రైల్వే స్టేషన్ దాదాపు ఇరవై కిలోమీటర్లు. సాయంత్రం పూట ట్రాఫిక్ రద్దీ భారీగా ఉంటుంది. మరో పక్క వర్షం పడేలా ఉంది. అంత చలిలోను అతనికి చమటలు పడుతున్నాయి. ఇక్కడ తన సాఫ్ట్వేర్ కోడ్ ఎంత సేపటికి రన్ అవ్వట్లేదు. డెడ్లైన్ దగ్గర పడుతుంది. “రైలు ఎన్నింటికమ్మ ” వాచ్ చూసుకుంటూ అడిగాడు జగన్నాధం, ఇంకో రెండు గంటల పైనే ఉందిలేండి నాన్న” బట్టలు సర్దుతూ ముక్తసరిగా చెప్పింది సౌమ్య. బట్టలు సర్దుతుందన్న మాటే కాని తన ద్రుష్టి అంతా వీధి గుమ్మం వైపే ఉంది. మరి అల్లుడు గారు వచ్చేలా లేరు, మనం బయల్దేరి స్టేషన్ కి చేరుకుంటే మంచిదేమో ! అసలే వాన పడేలా ఉంది. కొంచెం హెచ్చరిస్తున్నట్లు చెప్పాడు. బుక్ చేసిన క్యాబ్ నిమిషం లో వచ్చింది. సౌమ్య నెమ్మదిగా నడవ సాగింది. బయట అంత చిత్తడిగా ఉండటంతో జగన్నాధం చేయి సాయం పట్టడు
ఇంకా చిన్న పిల్లనేం కాదులెండి నాన్న అంది నవ్వుతు. ఆయన కూడా నవ్వి ఊరుకున్నాడు.
క్యాబ్ లో కి ఎక్కిన తర్వాత అడిగాడు. టాబ్లెట్స్ పెటుకున్నావా!” ఆఁ “డెలివరీ ఎప్పుడు అన్నారు ఇంతకీ.15 నుండి 20 తారీఖు మధ్యలో అన్నారు. కారు కిటికీ మీద జారుతున్న వాన చినుకును చూస్తూ ముక్తసరిగ చెప్పింది. మరి రిపోర్ట్స్ అన్ని పెట్టుకున్నావా ?” ఆఁ “ఇంతకీ ఎవరు పుడతారని అనుకుంటున్నారు. నాకైతే అబ్బాయి కావాలని,  ఆయనకేమో అమ్మాయే కావాలట! కొంచెం నొక్కుతూ చెప్పింది. జగన్నాధం మాట్లాడలేదు. కూతురుని పురుడుకి తీసుకురావడానికి వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాడు. అల్లుడు ఇంటికి త్వరగా రాడు వచ్చినా తన మానాన తాను ఉంటాడు. అబ్బాయి బాగా కామ్ పర్సన్ కాదమ్మా ? అవును నాన్న ఇద్దరం వసపిట్టలం ఐతే బాగోదు కదా నవ్వుతూ అంది. అబ్బాయికి ఒక సారి ఫోన్ చేయమ్మా. చేశాను నాన్న, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కిషోర్, ఐ నీడ్ టు లీవ్ నౌ ఇపుడు, బయల్దేరితే కానీ టైం కి చేరుకోలేను. ఈ ఒక్క కోడ్ రన్ చేసి వెళ్లుచు కదా! బతిమిలాడుతున్నటు అడిగాడు. కిషోర్ ఆతని బాస్. మాటలతో మాయ చేయడంలో దిట్ట భరద్వాజ సీరియస్ గా  చూసాడు.
“కమాన్ మాన్, జస్ట్ ఫైవ్ మినిట్స్, నీకు తెలుసుగా ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో. కొంచెం స్పీడ్ గా డ్రైవ్ చేస్తే వెళ్తావ్ లే. చేసేది ఏమి లేక మళ్ళీ తన కేబిన్ కి వచేసాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళాడు. ఈ సారి అడగటానికి కాదు, చెప్పడానికి మాత్రమే. అక్కడ బాస్ తన పి.ఏ. తో టేబుల్ పైన కూర్చుని ఫ్లర్ట్ చేస్తున్నాడు. భరద్వాజ తల తిప్పుకుని ఏదో అంటుండగా, రాత్రి క్లయింట్ కాల్ కి ఉంటున్నావ్ గా ” అన్నాడు. భరద్వాజ మొహం వివర్ణమైంది. సారీ కిషోర్ నేను వెళ్తున్నాను, మీటింగ్ లో కావాలంటే మహేష్ ప్రెసెంట్ చేస్తాడు అన్నాడు సీరియస్ గా, అతను ఎదో అంటుండగానే వినకుండా డోర్ తీసుకుని వచ్చేసాడు భరద్వాజ. వెనకాల కిశోర్ అరుపులు క్రమ క్రమంగా చిన్నవి అయ్యాయి. కార్ ట్రాఫిక్ లో నెమ్మదిగా వెళ్తుంది. ఇంకో పది నిముషాలు మాత్రమే ఉంది రైలు బయలుదేరడానికి. దాదాపు రెండు కిలోమీటర్ల ప్రయాణం. పెద్దగా వర్షం పడట్లేదు కానీ ట్రాఫిక్ మాత్రం బాగా జామ్ ఐంది. భరద్వాజ ఇక ఆలోచించలేదు కారును ఓ పక్కాగా పార్క్ చేసి పరిగెత్తడం మొదలు పెట్టాడు. తడిసిన నెల జారుతూ ఉంది మధ్యలో వచ్చే మోటార్ సైకిల్స్ ను తప్పించుకుంటూ పరిగెడుతున్నాడు. రొప్పుతూ, ఒక క్షణం ఊపిరి తీసుకోడానికి ఆగి మళ్ళీ  సమయం లేదని గుర్తొచ్చి పరిగెడుతున్నాడు. అతను రైల్వే స్టేషన్ కు చేరుకునే సరికి ఇంకా నిమిషం కూడా సమయం మిగిలి లేదు. చెమటతో స్నానం చేసినట్టు ఉన్నాడు. వర్షపు నీరు, అతని చెమట కలిసి అదొక రకమైన వాసన వస్తుంది. ఈ హడావిడిలో ఆటను భోగి నెంబర్ మర్చిపోయాడు. ఫోన్ చేద్దామని తీసి చూసాడు స్విచ్ ఆఫ్ ఆయింది.
ఈలోపు రైలు మొదలైంది. “ఛా”  అని గట్టిగ  పిడికిలితో పక్కనే ఉన్న స్తంభాన్ని కొట్టాడు. ఆలోచించి లాభం లేదని, ప్లాటుఫారం  మీద వెదకడం మొదలు పెట్టాడు. రైలుకు ఎదురు దిశలో పరిగెడుతూ కిటికీ లో నుండి వెతుకుతున్నాడు,
నెమ్మదిగా రైలు వేగం పుంజుకుంది. ఇంజిన్ ప్లాటుఫారం దాటి చాల సేపు అయ్యింది. ఇక ఆశలు వదిలేసుకున్నాడు. అప్పుడు కనపడింది అతనికి సౌమ్య వర్షం రాకుండా కిటికీ మూస్తూ. సౌమ్య అని గట్టిగ అరిచాడు. మూసి ఉన్న కిటికీ అతని పిలుపుని చేరనివ్వలేదు. పరిగెడదాం అనుకునేలోపు రైలు, స్టేషన్ దాటేసింది. ప్లాటుఫారం, అతను ఇద్దరు ఖాళీగా మిగిలారు.
ఎదురు చూపుల కన్నులకి కన్నీళ్లు తోడుగా నిలిచాయి. ఎప్పుడు పడుకుందో తెలియదు. రైలు కుదుపులకి తెల్లవారు ఝామునే మెలకువ వచ్చినట్లుంది సౌమ్యకి.
కళ్ళు బాగా వాచినట్లు ఉన్నాయి. నిద్రలేమి బహుశా (?) వేగు చుక్క ఇంకా విచ్చుకోలేదు. రాత్రి కురిసిన వర్షానికి నేల అంతా  చిత్తడిగా ఉంది. రైలు నెమ్మదిగా స్టేషన్ కు చేరుకుంది. జగన్నాధం సామాన్లు అన్ని కిందకి దించాడు. అడుగులో అడుగు వేసుకుంటూ సౌమ్య కూడా నెమ్మది గా కిందకు దిగింది. కూలి కోసం చూస్తూ ఉండగా వినపడింది. నేను ఉన్న కదా! పదండి మావయ్య. జగన్నాధం అవాక్కయ్యాడు
సౌమ్య కదలలేదు, కదలాలనిపించలేదు. ఎదుట నిలిచినా తన వాడిని చూసి చిత్తరువు అయ్యింది. బాల భానుని రాకతో మంచు తేరా నెమ్మదిగా కరంగా సాగింది. రాత్రి పూసిన పున్నాగ పూలు వర్షం లో తడిసి మరింత సౌరభాన్ని వెదజల్లుతున్నాయి. దూరంగా ఏదో గుడి నుండి విష్ణు సహస్రనామం వినిపిస్తుంది. బయట తోటలో జగన్నాధం బొండు మల్లెలకు పాదులు తొవ్విస్తున్నాడు. భరద్వాజ ప్రయాణ బడలిక తో పడుకున్నాడు. నెమ్మదిగ చప్పుడు కాకుండా లోపలి వచ్చింది సౌమ్య. చేతిలో చిన్న మంచినీళ్ల చెంబు ఉంది. అలికిడికి భరద్వాజ నిద్దరలోనే మంచానికి ఎడమ వైపు కి తిరిగి పడుకున్నాడు. నీళ్ళ చెంబు పక్కన పెట్టి తను కూడా మంచం ఎక్కి అతనికి ఎదురుగా పడుకుంది.
సౌమ్య అతన్ని చూస్తూ నెమ్మదైన స్వరంతో అంది అసలు దిగబెట్టడానికి రాకపోయే సరికి చాల కోపం వచ్చింది తెలుసా! అతను నిద్రలో నే ఉన్నాడు. బయట గునపాలు చప్పుడు వినిపిస్తుంది. కానీ పొద్దునే మిమ్మల్ని చూడగానే..అస్సలు ఊహించలేదు. ఆమె గొంతు జీరబోయింది, తనకి  ఏం చెప్పాలో అర్ధం కాలేదు. నెమ్మదిగా అతని దగ్గరకి జరిగి నుదిటి మీద ముద్దు పెట్టింది. ఒక్క క్షణం ఎదో అనుమానం వచ్చి అతని వైపు చూసి  “దొంగ ” అంది. నేనొచ్చానని తెలిసే మీరు అటు పడుకున్నారు కదా ” అతను కళ్ళు మూసుకొనే చిన్నగ నవ్వేసాడు. ఆమె దగ్గరగా జరిగి గుండెల మీద పడుకున్నాడు. ఆమె మళ్ళీ ముద్దు పెట్టుకుంది. అవునూ? మీ బాస్ కు ఏమని చెప్పి వచ్చారు. రెండు రోజులు ఆగితే ఆయనే కూల్ అవుతాడులే ” ఇద్దరు నవ్వుకున్నారు. ఇంతకీ అబ్బాయా? అమ్మాయా? ఖచ్చితంగా అమ్మాయే. ఒకళ్ళు కాదు ఇద్దరు, అచ్చంగా నీలాగే ఉండాలి.”
అతను ఆమెను చేరాడో ఆమె అతన్ని చేరిందో అది  దేవ రహస్యము. ఇద్దరు ఒకటయ్యారు. ఇప్పుడేంటి ఎప్పటి నుండో వారు ఇద్దరు ఒక్కటే, కిటికీ బయట పడక కుర్చిలొ కళ్ళు మూసుకొని వింటున్న జగన్నాధం గుండె కన్నీటి ముదావహం అయ్యింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!