పండు వెన్నెల

పండు వెన్నెల

రచన: రాధ ఓడూరి

చందమామ మురిసిపోతూ పండు వెన్నెలలో జలకాలాడగా…
నల్లని మబ్బులను హంస తూలికా పాన్పుగా చేసుకోగా…
తారా లోకం మెరిసే పూవులుగా దేవకాంచనాలను తలపిస్తుంటే…
పండు వెన్నెల భువిని తాకి నెమలి నాట్యం చేస్తుంటే…
ఆ వెన్నెల రేయిలో నీవు నా ఎదురుగా ఉండగా నా హృదయం మోహనరాగం ఆలపిస్తోంది..
కురిసే వెన్నల వాన సంపంగి సువాసనలను వెదజల్లుతోంది..
నీ రాక బృందావనాన్ని తలపిస్తుంటే…
నా కనుపాప సైతం నిను దాచిన నా మేను హరిచందనమవుతోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!