కవితా ప్రక్రియ

కవితా ప్రక్రియ

రచయిత: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

మనస్సు తిరిగే భ్రమరమైతే
దేవుడు అగమ్య గోచరమే,
మసక మసక చీకటయితే
దేవులాడటం కూడా వ్యర్థమే;

మానవత మరుగునపడి
మనిషితనం కనుమరుగు,
మానవలోకం వెతలుపడి
మనుగడ కోసం కొనసాగు;

పెళ్ళితో యిక రాజీతత్వం
జీవనం ఆనంద హరివిల్లాయె,
పెనిమిటి తోటి ఏకత్వం
జీవితం బహు వున్నతమాయె;

నాన్న మనస్సంత స్వచ్ఛంగా
అమ్మ పంచేది అమృత హృది,
నాకు మంచినే చేసిందిగా
అరమరిక లేని వారి మది;

ఆదర్శాలు ఆచరణైతే
లోకానికి వెన్నెల వెలుగులే,
ఆశలు బలంగా మొలకెత్తితే
లోకులకు మంచి కలలే;

సంపదవుంటే మన ఆప్తుడు
లేనినాడు అభిమానమే సొత్తు,
సంద్రంలో గజ ఈతగాడు,
లేమి మాత్రం అతని పొత్తు;
……
ఈ ప్రక్రియ నా స్వీయ రచన.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!