ఎందుకంట ప్రేమ.
రచన: జయ
ఎందుకంట ప్రేమ.
ఈ అలజడిలో
ఈ తుళ్ళింతలో
ఈ కవ్వింతలో
మునిగి తెలిపోతావు ప్రేమ.
నా చెంత నువు లేవని బాధో
ఎవరిచేంతో నీవు ఉన్నవాని దిగులో..
నీ మౌనం నా దగ్గరే అని వేదనో.
ఎవరి మాటల గోదారిలో చేప పిల్లల తుళ్లిపడుతున్నావో అని సందేహమా.
నీ జాడ లేని నిముషాలలో తెలియని మిసిమినో
ఎవరి చంద్రోదయాల్లో నువ్వు వెన్నెల వై వెలుగులు పంచుతున్నావో అని సంతోషమో.
నను మరిచిన నీవు.
నిను నీవు మర్చిపోయావు అని సంతసమో.
ఏమిటో తెలియని తికమకలో
ప్రేమ మైకంలో కొట్టుమిట్టాడుతున్న
వెర్రి మనస్సునో.
ఎందుకో చెప్పవే మనసా.
**************