అమ్మభాష తెలుగు.. అక్షరమై వెలుగు

అమ్మభాష తెలుగు.. అక్షరమై వెలుగు

రచన: పిల్లి.హజరత్తయ్య

సంస్కృతి వికాసానికి మూలమై
సాంస్కృతిక సంపదకు వెలుగై
అమ్మ ఒడిలో ఆనందమై
విశ్వ కళ్యాణానికి వేదికై
వసుధైకకుటుంబమై అలరారుతుంది..!

ఆకాశంలోని ఇంద్రధనస్సులా
పాలధారల స్వచ్ఛతలా
భావవ్యక్తీకరణకు సులభమై
ప్రపంచ ప్రశంసలు నొంది
ఇతరభాషలకు ఆయువై జీవిస్తున్నది..!

సాహితీ వనంలో విరబూసిన మల్లెల వలె
సువాసనలు వెదజల్లుతూ
అచ్చమైన నుడికారంతో
మమకారపు లోగిళ్లను మురిపిస్తుంది..!

మాతృభాషలో ఫలాలు పొంది
మాతృదేవతను ఘోషింప జేస్తూ
పరభాషపై కపట ప్రేమను ప్రదర్శిస్తుంటే
తల్లి మనసు తల్లడిల్లుతోంది..!

ఎవరి భాష వారిదే
ఎవరి గొప్ప వారిదే
జాతి అభివృద్ధికి స్ఫూర్తినిచ్చే
తేనెకన్నా తీయనైన అమ్మ భాష
తెలుగును అక్షరమై వెలిగిద్దాం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!