సమాజం

సమాజం
(కవిత సమీక్ష )

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షలు: సుజాత కోకిల

అధికారమనే కల్లాన్ని చేతిలోకి తీసుకుని నీ స్వార్థం అనేది లేకుండా స్వార్థంతో పేరుకుపోయిన సమాజమిది.బుక్కిందే కూలి అన్నట్టుగా దోచినాడే దోచుకోవడం ఇలా ఉన్నంతకాలం సమాజం బాగుపడదు. పల్లెల వారీగా చూసుకుంటూ వస్తే వాళ్లకే అర్థం అవుతుంది ఎక్కడ నిజాయితీ ఉంది ఎక్కడ అవనితి ఉంది ఎవరికి మనం ఏంచేస్తున్నాము. వాళ్లు ఎంత కష్టపడుతున్నారు మనం ఏం చేస్తున్నామన్నది వాళ్లకెే అర్థమవుతుంది. ఓట్ల అప్పుడే వస్తారు తప్ప మళ్లీ మధ్యలో రారు వాళ్ల కష్టసుఖాలను చూడరు, మధ్యతరగతి కష్టాలు చెప్పనవసరం లేదు వారి కష్టాలు దేవుడికే తెలుసు. నేను ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు నేను విలేజ్ లో ఉన్నాను. విలేజీలోని కష్టాలను చూసి రాస్తున్నాను.

************************
సమాజం

రచన: సుజాత కోకిల

ఓపికనెే ఆయుధంగా చేసుకొని
ప్రేమతో తీగల అల్లుకుపోతూ
సహనంతో ముందుకు అడుగులు వేస్తూ
చిరునవ్వుతో అందరినీ కలుపుకుంటూ
సమాజమే మనం అనుకుంటూ
చేయి చేయి కలుపుకుంటూ
ఒకరు కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ
బంధాలును కలుపుకుంటూ
అనుబంధాలను పెంచుకుంటూ
సమాజంలో నేను కూడా ఒకడినెే అనుకుంటే
ఇంకెందుకు మనకు ఈర్షాద్వేషాలు
ఇంకెందుకు ఆలస్యం చేయడం
పదండి నాతో చేయి కలపండి
పిడికిలి బిగించండి ముందుకు కదలండి
కుళ్లుకుతంత్రాల సమాజాన్ని మారుద్దాం
స్వార్థమనేది లేకుండా నిస్వార్థంగా
కదలి వద్దాం రండి మనమంతా ఏకమైతే
కుళ్లుకుతంత్రాల స్వార్ధాన్ని సమాది చేద్దాం రండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!