ప్రేమాను బంధాలు

ప్రేమాను బంధాలు

నీ కోసం చెమటోడ్చి కష్టపడే తండ్రి..
నీ కోసం రక్తాన్ని పాలగా మార్చిన తల్లి..
నీతో పాటు రక్తాన్ని కలిపి పంచుకున్న అక్క, చెల్లి…
వీళ్ళ ప్రేమ, అభిమానం ఎదో ఒక రోజు కావాల్సిందే అడవి కాచిన వెన్నెల!!

నీ కోసం తన వారిని వదిలి వచ్చిన భార్య ప్రేమ..
నీ కొరకే పుట్టిన కూతురు, కొడుకు ల ప్రేమ..
నీ కొరకై ఏర్పడే ఏ బంధమైన, అనుబంధమైన
నీవు అక్కరకు రానప్పుడు కావాల్సిందే అడవి కాచిన వెన్నెల!!

ప్రతి మనిషి జీవితంలో అడవి కాచిన వెన్నెల
వంటి బంధాలు,ప్రేమలు, బాధ్యతలు ఉంటాయి…
అలా లేకుండా ఉండటం దేవుళ్ల వల్ల కూడా కాలేదు..
ఇక మనమెంత..సముద్రంలో నీటి బొట్టు అంత!!

రచయిత :: హసీనాఇల్లూరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!