రాజయోగము

రాజయోగము
(పుస్తక సమీక్ష)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: ఎం.వి.చంద్ర

పుస్తక రచన: స్వామీ వివేకానంద

రాజయోగము పుస్తకము, స్వామీ వివేకానంద విరచితము. ఇందులో ప్రశాంతజీవనానికీ, ధృఢమైన శరీరానికీ, కావల్సిన యోగ, ధ్యానము, ప్రాణయామము, కుండలినీ విద్యలాంటి ఎన్నోవిషయాలను, స్వామివివేకానంద వివరిస్తారు. ప్రతిఒక్కరు ఈ పుస్తకాన్ని చదివి, నిత్యజీవితంలో
పాటించవల్సిన, అవసరం ఎంతోవుంది. దేవుడు మనకిచ్చిన గొప్ప వరాలు, యోగా, ధ్యానం. పూర్వకాలంలో ఋషులు అన్నమాటలన్నీ
నిజమయ్యేవి. వాళ్ళకు అద్భుతశక్తులుండేవీ. రాజ్యంలో వానలు కురవకపోతే తమతపోశక్తి ద్వార కురిపించేవారు, అలాగే, తప్పు చేసినవారిని
శపించేవాళ్ళు. ఈఅద్భుతశక్తులన్నీ, మనకు ధ్యానం ద్వారా వస్తాయి. మీరు ధ్యానంచెయ్యటం మొదలుపెడితే, మీలో వచ్చిన మార్పు మీకే తెలుస్తుంది. అటువంటి ధ్యానం గొప్పదనాన్నీ, ఎలా చెయ్యాలీ అన్నవిషయం ఈపుస్తకం వివరిస్తుంది. అలాగే, శరీరదృఢత్వానికీ, ఏకాగ్రతకు యోగా ఉపకరిస్తుంది. ఇందులో హటయోగా అనీ, కుండలినీ అనీ, రకరకాల యోగసాధనలు వివరిస్తారు. మొన్న కరోనాలో ఊపిరితిత్తుల శక్తికి, ప్రాణయామం ఎంతోమంచిదని, చెయ్యమని, పెద్దలు చెప్పారు. అటువంటి ప్రాణయామం ఎలాచెయ్యలో ఇందులో వివరించబడింది. చక్కని, ఆరోగ్యకర జీవన విధానానికి , రామకృష్ణామెషిన్ వారి ప్రచురణ “రాజయోగము” చదవి, పాటించండీ, ఆరోగ్యంగా జీవించండీ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!