జన్మ సార్ధకం చేసుకో
రచన: క్రాంతి కుమార్
కాలాన్ని తప్పుపట్టకు నీకు కలిసి రాలేదని
మనసును శిక్షించకు జాగ్రత్తలు చెప్పలేదని
అదృష్టాన్ని తిట్టుకొకు నీతో కలిసి ఉండలేదని
సమాజాన్ని కోపగించుకోకు నీలా ఎవరు లేరని
దేవుడిని నిందించకు నీ కోరికలు తీర్చలేదని
ప్రేమను వదులుకోకు నిన్ను ఏడిపించిందని
బంధాలను తెంచుకోకు భద్రతలో బంధించిందని
నీ పుట్టుకను అసహ్యించుకోకు ఉన్నత స్థాయిలో లేవని
అన్వేషించు నీలో
నీకు తెలియని విద్య కోసం….
సాధన చెయ్యి నీకు నచ్చిన
నువ్వు మెచ్చిన కళను….
ప్రపంచానికి పరిచయం చెయ్యి
నీలోని దాగిన ప్రతిభను….
జీవించు ఎదుటివారు
నిన్ను అనుసరించేలా…..
జీవించు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ
అనుభూతి చెందుతూ…
***