ప్రకృతి కాంత

ప్రకృతి కాంత

రచన: శ్రీదేవి అన్నదాసు

పచ్చ పచ్చని పంటపొలాలు
పొలాల నడుమ నీటి చెలమలు
చెలమల మధ్యన విరిసిన కలువలు
పొలం గట్టున మెత్తని గరికలు
గరికల నడుమ పెరిగిన తరువులు
తరువులకేమో కొమ్మల రెమ్మలు
కొమ్మ కొమ్మన రంగుల పక్షులు
రంగుల పక్షుల కమ్మని పలుకులు
పలుకులోన ఇమిడిన రాగాలు
రాగాల వినికిడి సరాగాల సవ్వడి తో
పరవశించె నా హృది పులకరించె నా మది
అన్నుల మిన్నుల ప్రకృతి కాంత నింపుకున్న సోయగం
పిల్ల గాలుల పవిట చెంగు రెప రెప లాడిస్తతుంటే
విరిసిన విరులను కురులలో తురుముకుంటుంటే
చూడబోతె రెండు కళ్ళు చాలకుండే
చెప్పబోతె మాటలింక లేకపోయె
వదలబోతె మనసురాక చేష్టలుడికి
తన ఒడి ఊయలలో వాలిపోయి నిదురపోయా

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!