ఉదయ రాగము

ఉదయ రాగము

రచన::నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం ఎప్పుడు ఎంతో హాయిగా అందంగా కనిపిస్తుంది
ఎన్నో అందాలు ప్రకృతి నుంచి వచ్చి మానవులకు అనందం పంచుతాయి
ప్రకృతి స్వార్థం లేకుండా మానవులకు ఎన్నో విధాల మేలు చేస్తుంది
సూర్యుడు వచ్చి మనల్ని నిద్ర లేపుతాడు వెలుతురు రానిదే ఇంకా మంచాల మీద దుప్పటి నుంచి బయటకు రారు

కాఫీ ఘుమ ఘుమ లు దోశె చుయ్యి చూయి అని వినిపిస్తే గాని లేవరు అప్పుడు తండ్రి పిల్లలు లేచి బాత్రూమ్ లు బందు చేసి రెడీ అయ్యి వస్తారు

ఈ లోగా. కొబ్బరి పచ్చడి కి కరివేప నేతి పాపులు సువాసన మా ఇంట్లో మనుష్యులను నిద్ర బద్దకం వదిలింది లేపుతాయి
సూర్యుడు తో పాటు అత్త మామ కోడలు నిద్ర లేస్తారు
ఏమైనా అంటే మేము కాస్త పడుతున్నము రాత్రి పన్నెండు వరకు వర్క్ చేస్తున్నాము మేము ఫారిన్ కంపెనీలు కనుక మనకు రాత్రి వారికి పగలు అంటారు
తండ్రి రావ్ జెనరల్ మేనేజర్
కొడుకు కూతురు కూడా విదేశీ కంపెనీ లో వర్క్ చేస్తున్నారు
విశాల కూడా పెళ్లికి ముందు బ్యాంక్ ఉద్యోగం చేసేది పెళ్లి తరువాత మాని పించేసారు

ముందు కొంచెం బాధ పడింది
కానీ తరువాత ఇంటి విష యాలు విద్యలను అలవాటు పడింది కారణం భారత దేశం లో పుట్టిన స్త్రీ ఆర్థిక సంపాదన కంటే అత్తింటి పద్దతులను పాటించడానికి అలవాటు పడిపోతారు అలా కానిదే ఉన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా కోడళ్ళు నిలబెడు తున్నారు.

అత్తలు కూడా. కోడళ్ళ కి అనుకూలంగా ఉండాలి ఇంటికి వచ్చిన పిల్లను తెగ పరిశీలించి
వంకలు పెడుతూ వెటకారం మాటలు ఆడుతూ ఎప్పుడు పుట్టింటికి పంపేద్ధామా అని సూటి పోటీ మాటలు అంటూ అత్త ఆడపడుచులు ఇంట్లో నిలబడ నీయక వెళ్లిపోయే లా ప్రవేర్తించితే ఇంక వాళ్ళు ఎలా ఉండగలరు కొడుకు తెచ్చిన డబ్బు భర్తా పెన్షన్ అన్ని కూడా అత్త గారి చేతిలో పెట్టుకుని
ఆడుతూ ఉంటారు .

భర్త భార్య కలిసి ఉండటం ఇష్టం లేదు ఆడ బడుచుకు పిల్లలు లేరు కొడుక్కి కూడా ఉండకూడదు పిల్లలు పుడితే
వాళ్ళను పెంచాలి అదో ఖర్చు
అంటూ హెచ్చరిస్తున్నారు
అత్తింటి వారు అందుకే బాధ్యత లున్న సంభంధాలు అడపడుచుకున్న సంభంధాలు
ఎవరు వప్పుకోడం లేదు తల్లి
తండ్రులు అలాంటి పెళ్లిళ్లు పిల్లలకి చెయ్యడం లేదు
దీని వల్లే సంభంధాలు దొరకక పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి

రావు తన అక్కలతో చాలా పడ్డాడు ఒక్కడే కొడుకు
ఇద్దరు అక్కలు వారు విద్య వంతులు అయినా అత్తింటి
బాధలు చాలా పడ్డారు
అత్తల పెత్తనం తో అగ చాట్లు
పడ్డారు వారి ఇంటి అల్లుళ్ళు
శ్రీ రామ చంద్రుడిలా అత్త మామల సేవ చెయ్యాలి వీరి అల్లుళ్ళు.పండగలకి కూడా వేళ్ళ కూడదు కొడుకుల్ని
అరచేతి గుప్పెట్లో నొక్కుకుని
ఉండాలి ఆమ్మ ఎస్ అని అత్త
ఎస్ అని అన్నలి అది వారి పరిస్తితి ఓ ఐస్ క్రీం గాని పది రూపాయల మల్లెలు గాని కొనకూడదు కొడుకు. తేకుడదు
అన్ని అత్తగారు కొని పెట్టాలి దానికి ఆడ బడుచు సలహా ఉండాలి అలా ఎన్నో పాట్లు పడి కుటుంబాలు నిలబెట్టు కొన్నారు ఇలాంటి వారికి మన
టివి సీరియల్స్ మరింత ఆజ్యం
పోస్తున్నాయి అవి చూస్తే జీవితం లో పెళ్లి అంటే విరక్తి
వస్తుంది అలాంటి కథలతో ఉంటున్నాయి అవి చూసి బయట కూడా అలాగే ప్రవెర్తిస్తున్నారు ఎన్నో రకాల
రెండు అర్థాలే వేరులే అన్నట్లు
వారి ప్రవర్తనలు ఉంటున్నాయి.
అందుకే రావ్ పిల్లల పెళ్లి విషయంలో ఆలోచన లో పడుతున్నాడు
ఆడపిల్ల అంటేనే భయ పడుతున్నాడు.
విశాల కూడా పిల్లల పెళ్లి విషయంలో భయ పడుతోంది
అక్కల పరిస్తితి చూసిన రావ్ విశాల మనస్సు నొప్పించక తానొవ్వక జాగ్రత్త గా నడిపేవాడు పెళ్ళానికి పోకేట్ మని కొంత ఇచ్చి కావాల్సి నట్లు వా డుకో మని చెప్పేవాడు తల్లికి తండ్రి పెన్షన్ వచ్చేది అది వాడుకుంటారు
డబ్బు చేతిలో పుష్కలంగా ఉంచితే కుటుంబ సభ్యులకు
కొన్ని సమస్యలు తగ్గుతాయని రావ్ ఉద్దేశ్యము
పెళ్లి అయిన కొత్తలో అక్కల జీవితాన్ని బట్టి కోడల్ని కూడా ఆంక్షలు పెట్టాలని అనుకుంది
కానీ రావ్ ఆవిడ మనసు తెలిసిన వాడు కనుక తల్లి నీ తల్లి లాగ భార్యను భార్య లాగ ప్రేమగా చూసేవాడు
తల్లి మాత్రం వెనుక నున్న తోక కన్న ముందు ఉన్న కొమ్ములు వాడి అని అన్నట్లు భార్య వచ్చాక తల్లి తండ్రులు పనికి రారు అని నిస్ట్టురం పడకుండా
జాగ్రత్త గా మసుకుకున్నాడు

విశాల పెద్ద ఇంటి నుంచి వచ్చింది అన్ని పనులు జాగ్రత్తగా చేసేది ఉద్యోగం మాన మంటే మానేసింది
పిల్లలు అత్త మామ ఇంటి పనులు లతో సరి పోయేది
అందుకే ఉద్యోగం మానేసింది
ఒక్క క్షణం దొరికితే చాలు కూతుళ్ళ పాట్లు చెప్పేది తను కనుక కోడలిని బాగా చుడుకుంటున్నా అనే కొస మెరుపు ఇచ్చేది.
ఒక సారి కూతురికి పుట్టిన రోజు వస్తోంది ఓ ఐదు వేలు పంపమని కొడుకుని పోరు పెట్టింది
సరే అని రావ్ తన ఫోనే నుంచి గూగుల్ పే ద్వారా పంపాను అని తల్లికి చూపాడు ఒకసారి
చిన్న కూతురి పెళ్లి రోజు అని డబ్బు పంపమని చెప్పింది తన వాళ్ళకి అయితే అన్ని సజావుగా జరగాలి అదే కోడలు పుట్టిన రో జు పెళ్లి రోజు అని పుట్టింటివారు ఫోనే చేస్తే ముఖం లో కోపం ప్రదర్శించి
మా ఇంట వంట పుట్టిన రోజు పెళ్లి రోజులు జరపం ఆ కొవ్వు వత్తులు కేక్ అంటూ ఇంగ్లీష్ పద్దతులు మొదలు పెట్ట వద్దు అని చెపుతుంది
పెళ్లి అయిన సంవత్సరం పుట్టిన రోజు చీర కొనమని
భర్త నీ అడుగు తుంటే అత్త గారు ఏమి సంజ్ఞ చేసిందో ఏమో నీకు బాగ్ నిండా చీరలు ఉన్నాయి రెండు బీరువాలు చీరలు ఉన్నాయి తలుపు తియ్యంగానే మీదకు దూ కే
నయాగరా జలపాతం లా జాజి పూలు సెంటు వాసనలు వెదజల్లే చీరలు వళ్లోకి వస్తాయి
నువ్వు ఏ చీర కట్టుకున్న అందంగా ఉంటావు మొన్న పుట్టింటికి వెళ్ళి నప్పుడు మి అమ్మగారు నాలుగు చీరలు కొన్నారని చెప్పావు మార్చి పోయావా అన్నాడు
విషయం అర్ధం చేసుకున్న విశా లి భర్త తల్లి మాటలు జవ దాట డ నీ అర్థం అయ్యింది అందుకే
ఇంకా రెండో మాట మాట అడ లేదు
ఎంత చదువు ఉన్నా ఎంత విద్య వంతు రాలు అయినా
అత్త గారి మాట విని తీరాలి
లేక పోతే ఆరోజు ఇంట్లో పెద్ద రాద్దాంతం చేస్తుంది

పెళ్లి రోజు బొబ్బట్లు తెమ్మని అడిగితే వద్దు అని చెప్పింది
అంతా క్రితం కూతురి పుట్టిన రోజు అంటూ బొబ్బట్లు తెప్పించి తిన్న ది రెండురోజులు
ఎండి పోయి అట్ట ముక్క లాంటి ముక్క పెట్టింది వద్దు నేను తినను అని విశాల విన్న బుచ్చుకుంది అనాడు నేను పెట్టిన బొబ్బట్లు తిన లేదు ఈ వాళ్ళ నీకు తెచ్చి పెట్టాలా అని కసూరు కున్నధి
విశాల లాంటి ఎందరో స్రీలు తమ పిల్లలు పెళ్లి వయసుకు వచ్చినా సరే ఆత్తింట మాటలు పడుతూ మన సు కష్ట పెట్టుకుని బయటకు చెప్పలేక
కుటుంబం కోసం భాధలు పడుతున్నారు.విద్య ఆస్తులు అంతస్తులు.ఉద్యోగం అన్ని ఉన్న పిల్లలు సహితం భారతీయ సంప్రదాయం సంస్కృతి కాపాడటం కోసం స్త్రీలు ఎంతో ఆవేదనలు హృదయంలో దాచుకుంటూ ఉన్నారు మన దేశంలో పెళ్లి భర్త పిల్లలు కుటుంబం ఇవే ముఖ్యం సీత పుట్టిన దేశం లో పుట్టిన స్త్రీ అనసూయ పుట్టిన దేశంలో స్త్రీ అంతా కాజ పోయినా కొంత అయినా మర్యాద మన న్నను పాటిస్తూ
కుటుంబ గౌరవం నిల బెడుతున్నారు ఎంత చదువు చదివినా సరే ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే ఇంటికి రాగానే ఇంటు.బాధ్యతల్లో ఇమిడి పోతారు. అదే మన స్త్రీల గొప్పదనము
అందుకే విశాల కూతురి పెళ్లి విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నది
అత్తగారు పిల్లల పెళ్లి విషయంలో తన పెత్తనం చెయ్యాలి కూతురి కొడుక్కి చెయ్యమని పట్టు పడుతోంది
రావ్ మాత్రం పిల్ల పెళ్లి విషయంలో తల్లిని కలగ చేసుకో వద్దు అని చెప్పాడు నువ్వు రెస్ట్ గా ఉండు పురాణం
నెట్లో విను అన్నాడు
కాల గమనంలో కూతురి ఇష్ట ప్రకారం ఆమెతో చదివిన అనిల్ తో జరిగింది పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించ బడతాయి అని సరి పెట్టుకున్నది పెళ్ళిలో గట్టి మేళం వాయించారు పెళ్లి అయ్యింది జీలకర్ర బెల్లం పెట్టేశారు పిడి కిట తలంబ్రాల పెళ్లి కూతురు అని సన్నాయి లో శ్రావ్యంగా వినిపిస్తుంది
అందరూ ఆనందంగా అక్షింతలు వేసి దీవించారు
ఆనందంగా బోజనాలు చేసి వెళ్లారు
అత్త గారు ఇంత కామ్ గా ఉందేమిటి ? అని అనుకుంటున్నారా?
కూతుళ్ళ అందరూ అమ్మని సంతోష పెట్టారు అమ్మ మేము బాగున్నా ముఅంటే అన్నయ్యా చలవే కదా నిన్ను నాన్నను వదిన బాగా చూస్తోంది కదా
ఈ రోజుల్లో ఎంతో మంది తల్లి తండ్రులను చూడటం లేదు అలాంటిది బంగారం లా చూస్తున్న కొడుకుని నువ్వు మాట లనవద్గు కోడలు లో కూతుర్ని చూడు అని హిత బో ద చెయ్యడం వల్ల పెళ్లి లో సంతోషంగా ఉంది
మనుమ రాలి పెళ్లి అయ్యాక
అత్తగారు విశాల ను ప్రేమగా చూస్తూ ఉన్నది జీవితంలో ప్రతి రోజూ ఉదయరాగము ఉదయిస్తుంది.

శుభము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!