ఆలోచన అమృతము

ఆలోచన అమృతము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం వేళ పిల్ల గాలి వెంట వస్తుంటే లాంగ్ డ్రైవ్ ఎంతో హాయిగా ఉంటుంది..అదే కవి హృదయం అయితే ఇంకా పరవశిస్తుంది. శ్రావణ్ కి డ్రైవింగ్ అంటే ఇష్టం, ఒక పెద్ద కార్ల కంపెనీలో పని చేసేవాడు నెలకి మంచి జీతం వస్తుంది. కానీ అతని మనస్సులో ఎన్నో ఆలోచనలు. అమ్మ నాన్నలు ఇద్దరు ఎంప్లాయిస్ ఏ విధమైన లోటు లేదు, అంతా సవ్యంగానే ఉన్నది..ఎం టెక్ గోల్డ్ మెడలిస్ట్ అయితే అతని స్వభావం అందరికీ వ్యతి రేకంగా ఉంటుంది. సమాజానికి అతని ఆలోచనలు, అమృతాలు కానీ తల్లికి ఇష్టం ఉండేది కాదు. కారణం బిస్కెట్స్ తినమని ఇస్తే కొన్ని తిని పంచి పెట్టేవాడు, కానీ తల్లి కి అది నచ్చేది కాదు, మిగిలినవి తెచ్చి డబ్బాలో పెట్టుకోవాలి. మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఆకలి వేస్తే నువ్వు తినవచ్చును అని చెప్పేది. పోనీ అవతలి పిల్లలు లేని వాళ్ళ కాదు, తండ్రులు ఆఫిసర్స్, అమ్మలకి పని లేదు ఇంటి పట్టునే ఉంటారు. పిల్లలు వచ్చేటప్పటికి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతారు. వాళ్ళు అవి తింటారు. శ్రావణ్ పెట్టే బిస్కెట్స్ ఇష్టమే రోజు ఒక పూర్తి ప్యాకెట్ అవుతుంది. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఇంతే అని సరి పెట్టుకున్నది. బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో చేరాడు అని ఆనంద పడ్డాడు. అయితే జాయిన్ అయి, ఓ ఐదు ఏళ్ళు ఉద్యోగం చేశాక అమ్మ నేను ఉద్యోగం మానేస్తా అన్నాడు. ఏమి నచ్చా లేదా! అన్నారు తల్లి తండ్రులు. మీ అక్క ఇదే చదువు చదివి కెనడా వెళ్లి పోయింది. అయిన మేము చెప్పినట్లు పెళ్లి చేసుకున్నది. నీ పెళ్లి కూడా చేసేస్తే మాకు భాధ్యత తగ్గుతుంది. మేము సంబంధం చూడమా లేక నువ్వు యేరు కుంటావా అన్నారు. ప్రస్తుతం నాకు సేవ గురించి అవగాహన కావాలి, ఆ మధ్య ఒక ఫ్రెండ్ తన తల్లిని తండ్రిని భార్య చూడటం లేదని ఓ హో మ్ లో చేర్పించాడు. కానీ అక్కడ అన్ని బాగా నచ్చలేదు. ఇల్లు ఉన్నట్లు ఎలా ఉంటుంది. ఉండదు అక్కడి రూల్స్ కి వీళ్ళు ఉండలేక పోయారు. శ్రావణ్ ఆలోచించాడు అమ్మ నాన్న కూడా రిటైర్ అవుతారు వాళ్ల పరిస్థితి ఏమిటి? ఇలా ఆలోచించి అమ్మాఫ్రెండ్ విశాఖలో ఓ వృద్ద ఆశ్రమం నడుపుతోంది. అక్కడికి వెళ్లి చూసాడు. అది తను బాగా రన్ చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఎన్నో కోట్లు సంపాదించింది. ఆ పట్టెడు మేతుకులకే కానీ, అదే కరువు అయ్యి పిల్లలు ఉండి కూడా తమ స్వార్థానికి వీళ్ళని వదిలేస్తున్నారు. సహజమే వారి బిడ్డల్ని వారు గారం చేసి నట్లే వీరు కూడా వీళ్ళ అమ్మ, నాన్న దగ్గర పెరిగారు. అది మర్చి పోయి దయ, దాక్షిణ్య ము లేకుండా ఉన్నారు, రేపు మా పిల్లలు ఇంతే హా హా అన్నారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం చేసుకుని కుటుంబాన్ని జీవితాన్ని వదిలేశాడు. అమ్మ ఫ్రెండ్ బ్రహ్మణి దగ్గరకు వెళ్ళి పద్ధతిగా వృద్ధులు సేవ, వైద్యం.ఇత్యాది విషయాల్లో మంచి ట్రైనింగ్ పొందాడు. ఆశ్రమం వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళు ఈ అబ్బాయి అవసరం ఉన్నది. కానీ పెళ్లి చేసుకుని కొంత కాలం పాటు ఇల్లు చూసుకుని తరువాత వస్తె బాగుంటుంది అన్నారు. కానీ అతను ఒప్పు కోలేదు. అవేశంలో నిర్ణయం తీసుకుని, ఆ తరువాత భాధ పడితే, ఇంకా జీవితం లేదు కదా! అది కాదు ఆంటీ ఎవరూ పిల్లని ఇచ్చి చేసిన, సంపాదనకు కదా పెళ్లి తరువాత ఉద్యోగం వదిలేస్తానను అంటే ఏ భార్య ఒప్పుకోదు, మరో బుద్దుడు అంటారు. అందుకే నేను ఇందులో సెటిల్ అయ్యాక, నా భావాలు ఇష్టపడి, సేవాతత్వం ఉన్న భార్యను ఎంపిక చెయ్యవచ్చును అని చాలా తేలికగా చెప్పాడు. ఆగస్టు పదిహేను అమృతోస్త్వవ సభలో అతనికి సన్మానం చేశారు. అక్కడ ఆ బిల్డింగ్ లో ఒక అమ్మాయి చాల సహనంగా అన్ని చూసు కుంటుఉన్నది. ఎవరు అని వివరాలు అడిగితే ఆ సంస్థలో మేనేజర్, అన్ని ఆమె చూసుకుంటుంది. అని చెప్పారు. ఇటువంటి శాంతం, సహనం ఉన్న అమ్మాయి అయితే మంచిది. తనకు సరిపోతుంది. భాధ్యతగా చూసుకుంటుంది. అలాగే ఆ ఆలోచన ప్రకారం అమలు చేశాడు. ఆ సంస్థ ఓనర్ నీ అడిగి వివరాలు కనుక్కున్నాడు. చిన్న కుటుంబంలో అమ్మాయి భాధ్యతగా పనిచేస్తుంది. అన్న దమ్ములు ఉండి కూడా ఆడపిల్ల భాధ్యతగా చూస్తోంది. చాలా మంచిది. అని చెప్పారు, శ్రావణ్ ఈ విషయంలో ఎంతో భాగా ఆలోచించాడు. అమ్మ నాన్నకి చెప్పాడు. వాళ్ళు కూడా మంచిది అని చెప్పి వెళ్లి మాట్లాడారు. మేము పెద్ద వాళ్ళమే, మీ అమ్మ నాన్న మేము కలిసి ఉంటాము. మీది ఎలాగ అద్దె ఇల్లు, మాది సొంత ఇల్లు మనం కూడా కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో సర్వీస్ చేద్దాము. మీకు ఇష్టం ఉంటేనే లేదంటే మనం వంట మనిషిని పెట్టుకుని మా ఇంట్లోనే ఉందాము అన్నారు. కొంత ఆలోచించి చెపుతాను అన్నారు ఆ పిల్ల తల్లి తండ్రీ. ఆ అమ్మాయికి అక్కడ పదివేలు ఇస్తారు. మనం ఆ పిల్లకి పదిహేనువేలు ఇద్దాము అని బ్రహ్మణి అనుకున్నది. అదే విషయం శ్రావణ్ తల్లి, తండ్రి కౌస్తుభ తల్లి తండ్రులుకి చెప్పింది. ఆమే మా సంస్థలో కూడా జాబ్ గా చెయ్య వచ్చును. భార్య, భర్త ఇక్కడే ఉండి ఉద్యోగం మాదిరి చేస్తారు అన్నారు. కారణము ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్న సరే వచ్చిన సరే జీవితాలు గడవటం కష్టం. రోజు రోజు అన్ని ధరలు పెరుగు తున్నాయి. అని ఆలోచించి చెప్పారు. సుభాస్య శీఘ్రం అని పెళ్లి వైభవంగా చేశారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, అంటూ గట్టి మేళం వారు శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన వినిపించింది. ఒక్కొక్క జీవితానికి ఒక్కోఆనందం వుంటుంది. కౌస్తుభ, శ్రావణ్ భావాలును కూడా ఇష్ట పడింది. కనుక వీళ్ళ జీవితం బాగుంటుంది. ప్రతి ఉదయం లాంగ్ డ్రైవ్ లో, సిటీకి వెళ్ళి కావాల్సిన వస్తువులు తెస్తూ, ఆఫీస్ పనులు చేస్తూ వార్కి నచ్చినట్లుగా ఆశ్రమం నడుపుతున్నారు. ఇప్పుడు బ్రహ్మణి మేడమ్, హమ్మయ మాకు వారసుడు వచ్చాడు అనుకున్నారు. ఆవిడ మనసులో ఆనంద అమృత ఉస్తవంగా ఆలోచనలు వచ్చాయి. వీరు చూపే ఆదర్శం ఎందరికో స్ఫూర్తి వీరికి కీర్తి. సర్వే జనా సుఖనోభవంతు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!