మూగజీవాలు

మూగజీవాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: VT రాజగోపాలన్

హలో! సార్..మిమ్మల్నేనండీ.. ముందు నుంచి ఓ తియ్యటి పిలుపు. వెనక్కి తిరిగి చూశాడు, ఎక్కడో దూరంగా వస్తున్నారు, ఎవరో, ఐతే నన్నే పిలుచుంటారు అన్న తీర్మానానికి వచ్చి, ఇటు తిరిగేలోగా, సార్ మిమ్మల్నే, ఓ సౌందర్యాల రాశి నవ్వుతూ, పంచండి, పంచండి, మీలో ఉన్న ప్రేమను పంచండి. మనసులో నన్నే, ఎంత అదృష్టం ఈ రోజు, వాకింగ్ కు బయలుదేరి వస్తే, ఇంత సంతోషమా, ఒకసారి చేతిలో గిల్లి చూసుకున్నాడు, కల కాదు నిజమే, కోరి వచ్చి ఓ సౌందర్యాల రాశి, ప్రేమ పంచండి, మీ వద్దే పెట్టుకోవద్దండి ప్రేమను, ఇలలో మీరున్నంతవరకు, అంటూ ఉంటే, వెంటనే చెప్పేశాడు ఐ లవ్ యూ.. అని. గల గల నవ్వులు, గుండెల్లో పరవళ్లు, సార్.. నా మీద ప్రేమ పంచడానికి మా వారు ఉన్నారు, నా వెనుక ఉన్న బ్యానర్ చూడండి, నోరు లేని జీవాలపై ప్రేమను పంచండి, వాటిని జాగ్రత్తగా చూసుకోండి, మూగ జీవాల పరి రక్షణ ప్రచారంలో భాగంగా ఈ కాంపెయిన్ ఈ రోజు మన విశాఖ పట్టణం బీచ్ రోడ్డున ఏర్పాటు చేశాం. ఇదిగోండి బ్లూ క్రాస్ కాంటాక్ట్ నంబరు, మూగ జీవాలను ఎలా చూసుకోవాలి అన్న దానిపై చిన్న బుక్లెట్, ఇంత సేపు మీరు నేను చెప్పినది విన్నందుకు స్మాల్ గిఫ్ట్ హంపెర్. డాబా మీద, ఇంటి బయట కప్పుల్లో నీళ్లు పెట్టండి, కాసింత గింజలు పెట్టండి. ఓ సారీ మేడం, 1992వ సంవత్సరంలో పుట్టిన వాళ్ళం, పెళ్లి జరగక చాలా కష్టపడుతున్నాం, ఇలా వాకింగ్, జాగింగ్ అని తిరుగుతున్నాం. మంచి చదువులు, మంచి కొలువులో ఉన్నాం. సారీ మేడం, పంచుదాం పంచుదాం, మూగజీవాలపై ప్రేమను పంచుదాం.
కూరగాయలు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు, తరిగిన కూరగాయల్లో పనికిరాని వాటిని ఓ బకెట్లో వేసి ఇంటి బయట పెట్టండి, నోరులేని జీవాలు వచ్చి తింటాయి, తాగుతాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!