ఆరోజు అనుకోకుండా

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

ఆరోజు అనుకోకుండా

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

శశిధర్ వర్ధమాన రచయితగా పేరుపొందాడు. అతనిరచనలంటే ముఖ్యంగా నవలలు బాగా పేరుపొందాయి . చరవాణితోనే నిత్యం గడుపుతున్న యువతరం కూడా బాగా అతనికి అభిమానులయ్యారు. ఎవరబ్బా ఈ శశిధర్ మళ్ళీ
వడ్డెర చండీదాసుని మించిపోయాడు అనుకున్నారు ఆనాటి రచయితలు ,పాఠకులు. అద్గదీసంగతి యువతరం ఎందుకంతగా ఇష్టపడుతునారో శశిధర్ నవలలంటే.కావల్సినంత ఉద్రేకాలు మానసికభావనలు సెక్సీగా వుంటాయని. అలా అర్ధం చేసుకున్నారేమో మరి. ఇదెన్నాళ్ళ బాగోతమో మనము చూద్దాంలే అని తోటి రచయితలు అసూయతో ఎదురుచూస్తున్నారు. ఏమైనాగాని ఈనాటి యువతరాన్నీ మెప్పించడం అంత సులభంకాదు గదా!
శశిధర్ని  ఇంటర్వూ చేయడానికి ఒక ప్రముఖ పత్రికా విలేఖరి వచ్చాడు. ఆయన శశిధర్ రచనలను బాగా పొగడుతూనే ఆయన రచనలకు ఎవరైనా ప్రేరణ ఉన్నారేమోనని కాని శశిధర్ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.ఇక ఇతనిని కదిపి లాభం లేదనుకొని ఆ పత్రికావిలేఖరి వెళ్ళీపోయాడు. శశిధర్ మనసులో ఒక అలజడి ప్రారంభమైంది. నిజానికి తనలో ఆ కదలికని కదిలించింది ఊర్వశి. ఆమె తన జీవితంలో ప్రవేశించడం యాదృచ్చికమే.
అపుడు శశిధర్ కాలేజీలో చేరాడు డిగ్రీ చదవడానికి. అంతవరకు తనగ్రామంలో వున్న జూనీయర్ కాలేజీలో ఇంటరు వరకు చదువుకున్నాడు. ఆ జీవితం అతనికేమి కొత్తగా అనిపించలేదు.అంతెందుకు అతనప్పటివరకు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉండేవాడు. చదివింది కో-ఎడ్యూకేషన్ కాలేజియేగాని అమ్మాయిలవంక కన్నెత్తి చూసేవాడు
కాదు. అతనికి చెల్లెల్లు లేరని అందరూ చెల్లెల్లే అని అనుకోసాగాడు. కాని పట్నానికి వచ్చేక డిగ్రీకళాశాలలో చేరడంతో అక్కడా అమ్మాయిలున్నారు. మొదట్లో వాళ్ళవంక చూసేవాడేకాదు. విచిత్రమేమంటే ఆ కళాశాలలో అబ్బాయిలకంటే అమ్మాయిలే ర్యాగింగ్ చేయడం ఆశ్చర్యమనిపించింది. అలా అనుకోకుండా
ఆరోజు ……
మొదటపిరీయడ్ ఇంగ్లీషు ఉందని ఆ పీరీయడ్  మిస్సుకాకూడదని త్వరత్వరగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వెనకనుంచి ఎవరో గుద్దిడంతో ముందుకు పడిపోబోయాడు. తమాయించుకొని నిలబెడ్డాడు.
“ఏయ్!మిస్టర్ ఎలావుంది వొళ్ళు. వెనకాముందు చూసుకోకుండా నడుస్తున్నావా? అమ్మాయిలే ఏంచేస్తుందిలే అని ధౌర్యమా?నా సంగతి నీకింకా తెలియదనుకుంటా. నాతో పెట్టుకుంటే నీ సంగతి అంతే.మీవూరికి మూటాముల్లె సర్దుకోవాల్సిందే”ఒక్క క్షణంకూడా గేప్ ఇవ్వకుండా మాట్లాడసాగింది.
శశిధర్ మూగిమొద్దులా అలా నిలబడిపోయాడు. మళ్ళీ చిటికె వేస్తూ ఊర్వశి “సారీ చెబుతావాలేదా!నలుగురిని పిలవమంటావా?” పెద్దగా అరవసాగింది.
ఎలాగో ధౌర్యం తెచ్చుకొని శశిధర్ సమాధానంగా
“నేనెందుకు సారీ చెప్పాలండి!నా తప్పేం లేదే? మీరే నా వెనుకనుండి వచ్చి గుద్దారు.నేను పడబోయి నిలుచున్నాను.” అన్నాడు.
“ఏమిటి?నేను నిన్ను గుద్దానా?”దబాయించింది ఊర్వశి.ఈలోగా ఊర్వశి మూక మొత్తం మూగిపోయారు.శశిధర్ కి ఇక మాట్లాడే అవకాశమే  ఇవ్వలేదు. అంతా కలిసి అతనిపై మాటలతో దాడికి దిగారు. ఇక చేసేదేమిలేక క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు.అలా అలా చిన్న చిన్న తగువులతొ ప్రారంభమైన పరిచయం దినదిన ప్రవర్ధమానమై సన్నిహిత్వం పెరిగింది ఊర్వశి శశిధర్ లమధ్య.అది ప్రేమగా పరిణమించె తరుణంలో ఊర్వశి చదువు పూర్తైపోయి పై చదువులకు వెళ్ళిపోయింది.
శశిధర్ తన చదువుపై శ్రద్ధపెట్టసాగాడు. అప్పుడప్పుడూ ఫోనులో విడియోకాల్సు చేసి మాట్లాడుకోవడం
జరిగేది. అది రాను రాను ఊర్వశినుండి తగ్గిపోయింది. శశిధర్ చేస్తే బదులుకూడా వచ్చేదికాదు.విసుగుచెందకుండా చేసేవాడు. స్విచ్ఛాఫ్ అని సమాధానం వచ్చేది.కొన్నాళ్ళకి విరక్తి కలిగి చెయ్యడం మానివేశాడు.తన చదువుపూర్తిచేసుకొని
పిజి చెయ్యడానికి వెళ్ళిపోయాడు హైద్రాబాద్ ఉస్మానియావిశ్వవిద్యాలయానికి.సాహిత్యంపట్ల ఇష్టంతో తెలుగుసాహిత్యం తీసుకున్నాడు. పూర్తిగా చదువులో నిమగ్నమైపోయాడు. కాలచక్రం  గిర్రున తిరిగిపోయింది.శశిధర్ పిజిపూర్తిచేసి
ఉస్మానియాలోనే రిసెర్చస్కాలర్గా చేరిపోయాడు. ఈమధ్యకాలంలో ఊర్వశి ఆలోచనలు అతనికి మళ్ళీ ఇబ్బంది పెట్టసాగాయి. ఫోను చేస్తే స్విచ్చాఫ్ అనే వస్తోంది.  ఊర్వశి స్నేహితులందరికి ఫోను చేసాడు. ఎవరూ కూడా తనగురించి తెలియదని చెప్పారు. ఇక తన ధ్యాసంతా రిసెర్చమీద రచనావ్యాసాంగాలమీదకి మళ్ళించాడు. ఆలా స్త్రీపురుషసంబంధాల మీదే రచనలు రాయడం ఆవి బాగా ఆభిమానులను సంపాదించుకునేలా చేసాయి.
తెలుగుభాషాదినోత్సవసందర్భంగా ఒక పెద్ద సాహిత్యసమావేశం నిర్వహించడానికి అన్నివిధాల ఎర్పాట్లు చేయసాగారు. తనకన్నా సీనియర్లు అవన్ని చూసుకొసాగేరు. విదేశాలలోవున్న రచయితలను ,కవులను ,సాహితీవేత్తలను ఆహ్వానించసాగారు. దానికిసంబంధించిన కరపత్రంచూశాడు. అందులో డా.ఊర్వశి అనేపేరును చూశాడు. మిగతా ఆహ్వానితుల ఫోటోలున్నాయి గాని డా.ఊర్వశిఫోటోమాత్రంలేదు.శశిధర్ ఆ కరపత్రంచూసి తన సినీయర్లను అడిగితే వారు తినబోతురుచులెందుకని చెప్పి తప్పించుకున్నారు గాని ఆమెగురించి చెప్పలేదు.శశిధర్ ఆమె ఆయ్యుండవచ్చని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూడసాగేడు.
ఆరోజురానేవచ్చింది. ఆహ్వానితులందరూ ఒకొక్కరుగా రాసాగారు. శశిధర్ చూపులన్నీ డా.ఊర్వశిరాకకై ఎదురుచూస్తున్నాయి. కార్యక్రమమం ఆరంభమైంది. ఆమె ఇంకా రాలేదు. అప్పుడే ఒకొక్కరి పరిచయం కార్యక్రమం ప్రారంభించేరు. ఇంతలో సమన్వయకర్త మైకులో ప్రకటనచేశాడు.డా.ఊర్వశిగారు వస్తున్నారని ఆమెకు స్వాగతం పలుకుతున్నామని.ముందువరుసలోనే కూర్చున్న శశిధర్ వేదీకమీదకి దృష్టి సారించాడు.విద్యుత్ లతలా
తళుక్కున మెరిసినట్లు వేదిక పైకి వచ్చింది డా.ఊర్వశి.శశిధర్ కళ్శలో ఆనందాశ్చర్యాలు మెరిశాయి.అవును తను తనే ఊర్వశినే.ఇన్నాళ్ళ నిరీక్షణ ఫలింంచింది.ఈ కార్యక్రమమం త్వరగా పూర్తయిపోవాలి. వెంటనే తను ఊర్వశిని కలసుకోవాలి.ఇన్నాళ్ళు తననెందుకు పట్టించుకోలేదో అడగాలి ఇలా శశిధర్ తన ఉత్సుకతను ఆపుకోలేకపోతున్నాడు. క్షణాలు గంటల్లా గడపుతున్నాడు. ఒకొక్కరి సన్మానసత్కారాలు జరిగిపోతున్నాయి.ఒకరి తరువాత ఒకరు ఎవో
భాషణలు ఇస్తున్నారు. కాని ఇవేవి శశిధర్ చూడటంలేదు .వినడంలేదు. ఎంతవేగంగా ఈ కార్యక్లమం ముగుస్తుందా అని ముళ్ళమీదకూర్చున్నాడు. చివరిది డా.ఊర్వశిదే. ఇంకా తనెంతసేపు మాట్లాడుతుందో అనుకున్నాడు. కాని అతని నిరీక్షణ ఫలించినట్లు ఊర్వశి కాదు కాదు తనప్రేయసి ఊర్వశి టూకిగా ముగించేసి వెంటనే వేరే కార్యక్రమముందని చెప్పి వేదిక దిగిపోయింది. ఒక్క పరుగున డా.ఊర్వశిని కాదు తన ఊర్వశిని చేరుకున్నాడు శశిధర్. ఇరువురూ ఒకరికిఒకరు ఎదురయ్యారు.
“ఊర్వశి”అని పిలిచాననుకున్నాడు .అరిచాడు ఉత్సుకతతో.
“శశి”అంటూ ఆమె కళ్ళలో మెరుపుతో
“ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా!..”.ఇంకా ఎదో శశిదర్ అనబోతుంటే
“ఇంక వచ్చేశానుగా”అంటూ చేతులుచాపి శశిధర్ని
చుట్టేసింది డా.ఊర్వశి.
విడిపోయినబంధం మళ్ళీ ఎదురైందని శశిధర్ ఆమెను అల్లుకుపోయాడు అది బహిరంగప్రదేశమని ఆలోచించకుండా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!