మానవత్వం

మానవత్వం

రచయిత :: మల్లాదిసోమేశ్వరశర్మ

గడ్డుకాలానున్నాము
ఎవరికీ ఎవరూ కాకుండా!
అంతా అయోమయమే!
అంధకారబంధురమే!
రక్షకభటులకు ఎండావానలేదు!
వైద్యసిబ్బంది ప్రాణాల తెగింపు!
పారిశుద్ధ్య కార్మికుల
పరిశుభ్రత!
బయట కాలుమోపాలంటే భయం!
ఎవరితో మాటాడాలన్నా అనుమానమే!
ఎక్కడ ఎలా ఏంకొంపమునుగునోయని!
ఏమీపాలుపోవడంలేదు!
ఏమీ చేయలేకపోతున్నామే!
అంతటా నిస్సహాయత!
నిర్లిప్తత తోనే!
జనుల నిర్లక్ష్యం
మాస్కు వేయరు
శానిటైజర్ పూయరు
భౌతిక దూరం పాటించరు
ఎవరికి వారేగొప్పోళ్ళు
ఎవరూ ఎవరి మాట వినరు!
ఎందుకు వినాలనే ధోరణి
అందుకే కరోనా విలయతాండవం
ఎవరాపగలరీ విలయం
ఏమిటీవిలయతాండవం
దీనికి అంతే లేదా
ఆపేస్థితిలేదా
జగతంతా ఒక్కమాదిరే
మనమే ఆలోచన చేద్దాం
కరోనా కట్టడి చేద్దాం
ప్రభుత్వాలకు సహకరిద్దాం

మల్లాదిసోమేశ్వరశర్మ

You May Also Like

One thought on “మానవత్వం

  1. చాలా నిజాలు చెప్పారు సార్!!
    అంత మన చేతిలోనే ఉంది నైస్ అండి 👌🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!