కరుణ లేనిమృత్యువు
రచన: కార్తీక్ దుబ్బాక
మృత్యువు నిన్ను తలిస్తే
కళ్ళు వర్శించే మేఘాలు
గుండెలుసముద్రసుడిగుండాలు
అర్దాంతరమరణాలు నేడు
భార్య,బిడ్డలవేదన,రోదనలు
శోకాల జీవితాలప్రపంచంనేడు
నీ ఒడిలోశాశ్వత నిద్రకు
అందరంవస్తాము,ఆశలేనిరోజు
అర్దాంతరంగతీకెళ్లకు……
బాధ్యతలు తీరిన రోజు
బ్రతుకు భారమైన రోజు
నీ ఒడిలోఒరిగేరోజుఆనందం
దారేతెలియని చిన్నారుల
భవిష్యత్తు అంధకారం అయితే
బాల్యం బలై చీకటి మూగితే
హృదయంద్రవించి,కన్నులు
చెమ్మగిల్లి, బాధ దిగమింగాను
*కరుణలేని మృత్యువు*….