అందం

అందం

రచన: కవిత దాస్యం

రవివర్మ గీసిన చిత్రాని వా..
బాపు గీసిన బొమ్మ వా…
అజంతా శిల్పానివా…
నండూరి యెంకి వా…
ఆమని పాటవా…
రవిగాంచని కిరణాని వా…
జాబిలి పంచని వెన్నెలవా…
విచ్చుకున్న విరజాజుల సుగంధానివా..
రంగుల కే అందం కూర్చిన రంగవల్లికవా..
పూలకే సున్నితత్వం నేర్పిన పూబోణీ వా…
హంస కే నడకలు నేర్పిన వయ్యారి భామ వా…
నెమలికే నాట్యం నేర్పిన నాట్యమయూరి వా…
కళలకే భాష్యం చెప్పిన కళాకారిణి వా..
కన్నుల సోయగం తో మత్తెక్కించే మధుకైటభానివా..
వంపుసొంపుల వయ్యారాలతో రాజ్యమేలే అందానికి మహారాణి వా..
ఏమని పొగడను, ఏమని వర్ణించను నీ అందం…
గులాబీ తో పోలిస్తే ఎక్కడ ముల్లు గుచ్చుకుంటాయో అని…
మల్లె తో పోలిస్తే వాడి పోతావని…
జాబిలి తో పోలిస్తే అమావాస్య చీకటి నిన్ను కప్పేస్తుందని…
నా హృదయ మనోఫలకంపై నీ బొమ్మ చెక్కి ఉంచా…
నీ ప్రేమతో నిండి ఉన్న ఆకాశమంత హృదయాన్ని పరిచి వుంచా..
పల్లకిలా ఎక్కి యెదలో
ఊరేగుతావని…
నా జీవితాన్ని కర్పూరం లా వెలిగించా నీకై…
ఆ వెలుగులో జీవితం పండి స్తావని…
ఆశనై ఎదురుచూస్తున్న బానిసగా నీ ప్రేమదాసు నై…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!