నిశ్శబ్దపు యుద్ధం

నిశ్శబ్దపు యుద్ధం

రచన: బండి చందు

తన కన్నీటి అల తాకి
నా ప్రతి కలా చెదరిపోతుంది
తన ఊహల ఊసులకే
నా ఊపిరి ఆగేలా వుంది
తన అందెల సవ్వడికే
నా నడకల నడవడి ఆగినది
ఆ మాటల మధురిమకే
నా గొంతు మూగపోయినది
ఆ కంటి కొన చూపుల అలకలకే
నా లోకం చీకటి అయినది
కళ్ళతో ఖైదు చేసావని చెప్పలేను
అయినా బంధీ అయిపోయాను
మౌనంతో కట్టి పడేసావని అనలేను
విడిపించుకోలేని సంకేళ్ళతో విలపిస్తున్నాను
మాటలతో గాయపరిచావని అనుకోలేను
అయినా క్షతగాత్రుడనై పడి వున్నాను
నిశబ్దపు యుద్దమే అయినా
రక్త సిక్తపు ఆలోచనలతో ఓడిపోయాను
వెను తిరిగి చూడని నీ కోపం
నా మరు శ్వాశకు అది ఆఖరి క్షణం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!