అమ్మనౌతున్నా

అమ్మనౌతున్నా

రచన: మీసాల చినగౌరినాయుడు

హంసనడకలతో పరుగులెత్తే ఆ నదీ కన్యకలందరూ
అలసిసొలసి నా ఒడిలోచేరి,జలకాలాటతో తడిసిన వారికి తోడునౌతున్నా

స్వదేశీవిదేశీ వర్తకానికి
రహదారినౌతూనే
సహకార వంతెననై
బంధాలు పెంచి
బంధువునౌతున్నా…

మత్స్యావతారుడ్ని
మనువాడి
బెస్తవారికి ఇష్టుడనై
ఆహారాన్నందించు
అమ్మనౌతున్నా….

శతృదేశపు కుతంత్రాలకు
యంత్రాయుధములను నిల్పి
వెన్నులో వణుకుపుట్టించే స్థావరమౌతున్నా….

ఖార్ఖానాల కన్నీరు తుడుస్తూ
నగరవాసుల అవసరాలు తీరుస్తూ
విరామపు నెలవుగా
ఆసరానౌతున్నా….

ఎగిసే కెరటంతో స్ఫూర్తినింపుతూ
ప్రశాంతతకు రూపుదిద్దుతూ
విశ్వశ్రేయస్సుకు
నడుం కట్టే
పెద్దనౌతున్నా…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!