చరిత్ర పాఠాలే విజయానికి మార్గాలు

చరిత్ర పాఠాలే విజయానికి మార్గాలు

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

విజయం శ్రమకు ఫలం సాధించడం అసాధ్యం
కానీ సాధనతో సాధ్యం కాదేదీ సాధనకు అసాధ్యం
విజయం మనవెంటే ఉండాలంటే
లక్ష్య సాధన కలిగి వుండాలంతే
కష్టనష్టాలు ఎదుర్కొనగలిగితే విజయాలు నీ వెంటే

లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయినా
అబ్దుల్ కలాం భారత్ ప్రెసిడెంట్ అయినా
నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ అయినా
వారి వారి కష్టాల ప్రతిఫలమే

మహత్తర కార్యాలు ఒక్కరోజులో సాధించలేం
Kfc 75 ఏళ్ల వయసులో కోటీశ్వరుడు గా మారెను
పదివేలు సార్లు ప్రయోగం తప్పిన తరువాత ఎడిసన్ బల్బు కనుగొన్నాడు
అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి మోదీ భారత్ ప్రధాని అయ్యేను

ఇవన్నీ చరిత్ర చెప్పిన సత్యాలు
నాటి విజయగాధలే నేటి విజయమార్గాలు
చరిత్ర అనుభవాలే భవితకు పాఠాలు
పాఠాలే విజయ యాత్రకు సోపానాలు

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు
కష్టపడితే కలలు నిజమవుతాయి
ధైర్యం తో ఒక అడుగు వేయు వేయి అడుగుల విజయం తధ్యం
ధైర్యే సాహసే లక్ష్మి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!