అనిశ్చిత కాలం!

అనిశ్చిత కాలం!

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత.పి.వి.ఎల్

ఒక్కోసారి అనిపిస్తూంటుంది..
కదిలేది..కనిపించేది..
కనులమెదిలేదీ..
కనుగొనలేని సత్యమని!..
సూర్యోదయం నుంచి
అస్తమయం వరకు
నిత్యం జరిగే కార్య చలనాలు అనిశ్చితాలని!..
కొన్ని క్షణాలు సంతోషం..
మరికొన్ని దుఃఖంతో దొర్లిపోతుంటాయని!..
మనిషే కాదు..
ఈ విశ్వం కూడా
పంచభూతాల నడుమ నడిచే యంత్రమని!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!