తెలుసుకున్న తప్పు

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
తెలుసుకున్న తప్పు   
రచన: వలిపే రామ్ చేతన్

అనగనగా హైదరాబాదనే నగరంలో
ఒక వ్యాపారస్తుడుండేవాడు. అతనిపేరు జగదీశ్ రెడ్డి. అతడు చాలా మంచివాడు, గుణవంతుడు, తెలివైనవాడు. అతడు చీరల వ్యాపారం చేస్తుండేవాడు.అతనికిద్దరు కొడుకులుండేవారు. వారిపేర్లు చరణ్, కిరణ్.చరణ్ చాలా మంచివాడు. కిరణ్ స్వార్థపరుడు. డబ్బులెప్పుడూ ఖర్చుచేస్తుండేవాడు. కిరణ్ కు కోటీశ్వరుడిలా ఆస్తి అనుభవించాలని కోరిక. జగదీశ్ రెడ్డి అలా కష్టపడి నగరంలోనతిపెద్ద వ్యాపారస్తుడయ్యాడు. ఇప్పుడతను కోటీశ్వరుడయ్యాడు.ఒకరోజు కిరణ్ “నాన్నిప్పుడు కోటీశ్వరుడు. అయితే ఇప్పుడు ఆస్తిని నాన్నతో బలవంతంగా రాయించుకోవాలననుకున్నాడు”.
తదుపరిరోజు కిరణ్ననుకున్నట్లుగానే జగదీశ్ రెడ్డినాస్తినడిగాడు.జగదీశ్ రెడ్డి బాధపడి ఏం చేయాలో తెలియక చరణ్ ను అడగమని చెప్పాడు. కిరణ్, చరణ్ దగ్గరకెళ్ళి ఆస్తినడిగాడు. చరణ్ ఏం చేయాలో తెలియక ఒకరోజు సమయమడిగాడు. కిరణ్ సరేనన్నాడు. చరణ్ రాత్రంతా ఉపాయమునాలోచించాడు. తదుపరిరోజు చరణ్ చెప్పినట్లుగానే ఆస్తిపత్రాలు తెచ్చాడు. సంతకం పెడుతుండగా చరణ్ “కిరణ్! ఈ ఆస్తితో నువ్వేంచేస్తావు”,అనడిగాడు.
కిరణ్“నేను ఈ ఆస్తితో ఏమైనా కొనొచ్చని”, చెప్పాడు.చరణ్ ఏం కొంటావనడిగాడు. కిరణేమీచెప్పలేదు. చరణ్“నవ్వు ఏదైనా కొనగలవు, అభిమానాన్ని కాదు. నవ్వుతూ ఉండవచ్చు, సంతోషంగా ఉండలేవు. నాన్నకిష్టమైనవన్నీ కొనగలవు, నాన్న ప్రేమను కొనలేవని”,చెప్పాడు.ఆ మాటలను విని కిరణ్ తన తప్పును తెలుసుకుని క్షమాపణలడిగాడు. అలా క్షమాపణలు అడిగిన కిరణ్ చూసి అందరూ నీఇల్లు బంగారం కానూ అని ఆనందపడుతూ ఆ కుటుంబం అంతా అప్పటినుంచి సంతోషంగా ఉంది.

నీతి:డబ్బు జీవితానికి అవసరం
మాత్రమే.కాని డబ్బే జీవితం
కాదు.డబ్బును అతిగా
ఖర్చుపెట్టవద్దు. డబ్బుతో
కొనలేనివి కూడా ఉంటాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!