ఇదేకదా! ఇదేకదా! 

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
ఇదేకదా! ఇదేకదా!   
రచన::బిహెచ్.వి.రమాదేవి

అక్కడ మాటలు కోటలను దాటుతున్నాయి. బావ విషణ్ణ వదనంతో కూర్చుని వున్నాడు.వీళ్లు మాట్లాడే మాటలకు జవాబే ఇవ్వడం లేదు.ఇప్పుడు పెళ్లేమిటీ అనికూడా అడగడం లేదు.ముఖ్యం గా అమ్మానాన్నలు,కూతురు పోయిన దానికన్నా,కోటీశ్వరుడు ఎలా మనకు కాకుండా పోతాడేమో ననీ బెంబేలెత్తి పోతున్నారు. ముఖ్యంగా నేను డాక్టర్ చదివి యేవూళ్లుయేలాలోచెప్పమంటున్నారు.
నిన్నటి వరకు తండ్రి లా చూసిన బావతో పెళ్లా,,! వీళ్లకు మనసులు ఉండవా!? జీవిత మంతా డబ్బుతోనే ముడి పెట్టుకుంటారా! చస్తూ డబ్బు పట్టుకుని వెళతారా!?
“నువ్వు ఈ పెళ్లి చేసుకోక పోతే బావ బతకడు. పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు,,! తప్పకుండా చేసుకో! బంగారం వంటి వాడు.నిండా ఇరవయ్యయిదు కూడాలేవు ” అమ్మ ఏడుస్తూనే ప్రణాళికలు వేస్తుంది.పావులు కదుపుతుంది. భర్తను కుదుపు తుంది.ఆమెకు అందరూ బృందావన భజన చేస్తున్నారు.
ఎవరూ యేమీ వినిపించు కోవడం లేదు. తనను నోరు ముయ్య మని అమ్మ ముందే.వార్నింగ్ ఇచ్చింది.నా డాక్టర్ చదువుతో నే ను జీవితం లో సంపాదించ లేని డబ్బు, పాపిష్టి డబ్బు బావకుంది.నేను.బావతో.మాట్లాడతాను అన్నాను.
“అవసరం లేదు. ముహూర్తం పెట్టాక మాట్లాడు దువు గానీ.’
పిన్ని,అమ్మ ముక్త కంఠంతో అన్నారు.
పురోహితుడు అతిదగ్గరలో , లాంఛనంగా ముహూర్తం తేది చెప్పాడు.
“,సరే పద బావ లోనికి వెళదాం!”
నెమ్మదిగా కదిలాడు సురేంద్ర,!
“బావా ! నీకు నేను ఎలా కనబడుతున్నా ను,!?చెప్పు!
వసుధ కళ్ళల్లోకి చూస్తూ అన్నది.”
మగ కళ్ళు చూశాయి.అప్పుడే మొదటి సారిగా చూస్తున్నట్లు! అలవాటు పడటం ఏదైనా తనకు ఇబ్బంది కాదన్నట్లు, క్రొత్తగా,చావు తరువాత వచ్చిన ఆనందం లా,సిరిసంపదలు లేనీవాడికి వజ్రాల మూట దొరికినట్లు…
వడుధకు అర్థమయ్యింది. అందరి మాటలతో వీడు ప్రేపేరయ్యాడు. మాట్లాడి లాభం లేదు.
“,సరే! మనం రేపు గుళ్ళో పెళ్లిచేసుకోబోతున్నాం ఏర్పాట్లు నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు రేపు రాత్రి 9 గంటలకు రాముడు గుడికి రా!
చెప్పి పొడవాటి వాల్జడ.వెనక్కు విసిరింది.అతని గుండె లయ తప్పింది.కొంచం బలహీన మైన మొగ గుండె.ఈగుండె అక్రమ సంబంధమే పెళ్ళాం సుధ ఆత్మ హత్యకు తెర తీసింది.ఈ గుండె.తిరుగుళ్ళు మహారాజు అనే బిరుదు నిచ్చి కేసు పెట్టకుండా రక్షించింది.ఈ గుండె సోగ్గాడు అని డబ్బుతో కొట్టి అనిపించుకుంది. ఇప్పుడు ఈ గుండె వసుధ లోని కొత్త రుచులకు అర్రులు సాచుతుంది.
“సరే “అన్నాడు,,!

***

మరునాడు గుడి దగ్గర మేలి ముసుగులో నవవధువు, చక్కని అవయవ సౌష్టవం ,పట్టుచీర,ఎంతైనా చదువు కున్నోళ్లు చదువు కు న్నోళ్లే! అతని వంట్లో ప్రతి రక్తపు బొట్టు ఉరుకుతుంది.తహ తహ తొందర పెడుతుంది.తస్లి కట్టేసాడు.ముఖ. దర్శనం కోసం మే లిముసుగు తీయబోయే సమయంలో పురోహితుడు తలంబ్రాలుతీశాడు.తలంబ్రాలు పోయాలి.అన్ని అయ్యాక ముసుగు తీయగానే అప్పుడు కనబడింది.చెక్కిన శిల్పం లాంటి మల్లి,! యుంగ్ విడోగా విడిగా కొన్ని యేళ్ళుగా ఆపరేషన్ చేయించి మరీ అనుభవిస్తున్న చాటు ,
మాటు ప్రేయసి మల్లి.తనభార్య
బెదిరించి చస్తానన్నా ఆగకుండా ఆమె పరిష్వంగ మునకు తపించిన పెళ్ళాం కానీ జీవితాంతపుపెళ్ళం.నలుగురితో చీదరించ వడు తూ.తన ప్రక్కలో ఓదార్పుపొందే 23 యేండ్ల అబల.నేడు సింధూరంతో కళకళ లాడుతూ తన ప్రక్క….
గూడెంలో ప్రతి వాళ్ళు ఓసి నీ ఇల్లు బంగారం గానూ, అని వాళ్ళ ముక్కుల మీద కాకుండా పక్కోళ్ళ ముక్కుల మీద కూడా వ్రేలు వేసుకునేలా ……
బావా పద! ఇంటికి వెళ్ళిపోదాం. గౌరవంగా తీసుకువెడితే తీసుకెళ్ళు. లేదా అనాధ శరణాలయం లో ఓ పిల్ల వాడిని మల్లి కి తోడుగా ఉంటాడు.పెంచుకుంటుంది.అడుగులు ముందుకు వేస్తూ అన్నది.
పద! విసుగ్గా రెక్క బట్టుకు గుంజుతూ అన్నాడు.మల్లిని తెచ్చే ధైర్యం తనకు ఇన్నాళ్లు లేదు.ఇప్పుడు మొత్తం వసుధ అకౌంట్ లోనే పడతాయి.ఇది పోయినా అద్భుత ఆనందం తనకు దక్కింది. మల్లి వెనక్కి తిరిగి చేతులు జోడించి కళ్ళనీళ్లతో ముందుకు కదిలింది.

******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!