ప్రకృతిని కాపాడుకుందాం

ప్రకృతిని కాపాడుకుందాం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అలేఖ్య రవికాంతి

గలగలపారే జలగర్భాలు
ఆవిరై ఎండిపోయి దుఖిస్తున్నాయి
ప్రజల దాహార్తిని తీర్చలేక
రైతన్నల హ్రుదయాలు విలపిస్తున్నాయి
కలలాడే పొలాలు బీటలు వారగా
పచ్చని పొలాలతో కళకళలాడే పల్లెలు నేడు  కాలుష్యానికి మోడుబారి నిర్జీవమయ్యాయి
పల్లెల ప్రకృతి సొగసులు
కనుమరుగవుతున్నాయి
పల్లెలు తిరిగి పచ్చగా మారే యోగం ఉందా! సందేహమే!
పల్లెలు బాగుపడాలంటే
తిరిగి భగీరథుడే యజ్ఞం చేసి
ఆకాశగంగను నేలకు దింపాలేమో
మన పూర్వీకులు మనకిచ్చిన
పచ్చని వారసత్వపు సంపదని
పొదుపుగా వాడుకుంటు
కాపాడుకోవడం మనందరి కర్తవ్యం!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!