తోడు – నీడ
రచన: పి. వి. యన్. కృష్ణవేణి
మనసుకు మనసే ఓ మంచి తోడు
ప్రేమ ఉప్పెంగే హృదయానికి ఆ నీడ
ఒంటరి పోరాటానికి మనసు రగడ
నీడలా వెంట ఉండే నేస్తమే సరి జోడు
పంతాలన్నీ పక్కన పెట్టి చూడు
ఆనంద జీవితం నీ చెంతనుండు
నిన్ను నువ్వు ఉన్నతంగా ఊహించుచుండు
వెను తిరిగి చూడక ముందుకు సాగుతుండు
వెనుకంజ వేయడం పరిపాటి కాదు అనుచుండు
ధైర్యసాహాసాలే విజయ మార్గాలు అగుచుండు
తిరుగు లేని ప్రయత్నాలు నువ్వు సాగించుచుండు
అంతులేని ఆనందాన్ని చవి చూడు
తోడుగా వచ్చెదరు నిన్ను వెన్నంటి అప్పుడు
నిలిచెదరు వారు నీకు నీడగా తోడుగా
నీ విజయ సంకేతమే వారికి స్వాగతించగా
మరిచెదరు వారి కష్టనష్టాలను నీ నీడలో
దరిచేరనీయకు నిరాశ నిస్పృహలను ఇంకెప్పుడూ
నీకు ఆ దైవమే అగును తోడు నీడ
విజయ దప్పికను ఒంటి చేత్తో చేధించుకోవచ్చును