మౌనం
రచన :: జె.స్వయం ప్రభ
!!..మౌనం..!!
రెండు అధరాల సంగమే మౌనం..
మనిషి మనసుతో చేసే యోగం మౌనం..
శబ్దం వినిపించని నిరాకార స్వరూపమే మౌనం..
శూన్యంలో దర్శనమిచ్చే దివ్యతేజం మౌనం..
మాటే పలకని భావం మౌనం..
మనసుకు మాత్రమే తెలిసే అర్థం మౌనం..
వేల ప్రశ్నలకు సమాధానం మౌనం..
అల్పులకు తెలియని పుస్తకం..
జ్ఞానులు ఎరిగిన గ్రంథం మౌనం..
అజ్ఞానము తొలచి జ్ఞానమోసగే మంత్రం మౌనం..
మునులు జపిస్తూ పట్టించే యోగ పుష్పం మౌనం..
బ్రహ్మజ్ఞాన గమ్యం తెలిపే సూత్రం మౌనం..
గాలిని బంధించే పంచ సూత్ర మంత్రం మౌనం..
ఉరిమే మేఘమైనా మౌనం వహిస్తే
వచ్చే ప్రవాహం తెలియని ప్రళయం మౌనం..
ఎగసి పడే సంద్రం మౌనం వహిస్తే
మృత్యువై ముంచుకు వచ్చే కెరటల విస్పోటన విలయం మౌనం..
భగభగ మండే అగ్ని పర్వతం మౌనాన్ని విదనాడితే
ఉప్పొంగుతూ దూకే నిప్పులఉప్పెన ప్రవాహ
లావాయే మౌనం..
కొన్ని మార్లు మౌనం మిత్రుడే..
మరి ఇంకొన్ని మార్లు మౌనం శత్రువే..
మౌనం నీ చేతి వజ్రాయుధమే..
సరైన సమయానికి స్పందించకపోతే
నీ అంతానికి రూపమే
ఈ మౌనం..
చిరునవ్వు అందమైతే మౌనమే ఆభరణం..
***
బాగుందండీ మీ మౌన భాషణం👌👌💐💐💐💐💐