స్వచమైన రంగులు

స్వచమైన రంగులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చెరుకు శైలజ

ప్రకృతిలోనే అన్ని రంగులు
మానవాళికి ఇచ్చే ఎన్నో అనుభూతులు
ఉషోదయ సూర్యకాంతి ఎరుపు రంగుతో
పొద్దున్నే మనకు ఉల్లాసాన్ని కలిగించు
అవని అంతా ఆకు పచ్చని రంగులతో
అలారించే పచ్చని చెట్లు
అవి మన ఆనందానికి మెట్లు
నేలపై పసుపు పూసినట్లుగా
పసుపు పచ్చని రంగులతో
ఇంకా ఎన్నో రకరకాల  రంగుల పువ్వులు
అవి మన జీవితానికి తెచ్చే ఎన్నో పరిమళాలు
తెల్లని చల్లని వెన్నెలతో అలరించే చంద్రుడు
మన పాలిటి కలువలరాయుడు
ప్రకృతే ఇచ్చే ఇన్ని స్వచమైన రంగులు వుండగా
హోలీ  రంగులు వేరే ఎందుకు దండగా
హోలీ  స్నేహ సంబంధాలను బలపరిచేటందుకే
పిల్లలకు సంతోషాలు పంచేటందుకే
అది తెలుసుకొని మసలుకో
కల్తీ రంగులు వాడకు
పర్యావరాణన్ని కలుషితం చేయకు
నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!