మానవజీవనప్రగతి!

మానవజీవనప్రగతి!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

ఎం.వి.చంద్రశేఖరరావు

తరతరాలుగా, యుగయుగాలుగా,
మానవజీవన ప్రగతిని
చూస్తే, ఆశ్చర్యం వేస్తోంది!
చిన్నప్పుడు కట్టెలపొయ్యిలో,
కట్టెలు వేసి, ఊది, ఊది పొగలతో రగిలేవాళ్ళం!
కుంపట్లో బొగ్గు వేసి రగిల్చేవాళ్ళం!
మరి ఇప్పుడో, గ్యాసు, గీజర్ సుఖమే, సుఖం!
చిన్నప్నుడు సైకిల్ తొక్కుతూ, స్కూల్ కెళ్ళేవాళ్ళం,
లైన్లో నుంచొని పుస్తకాలు కొనేవాళ్ళం,
మరి ఇప్పుడో, స్కూలు బస్, అన్నీ స్కూలులోనే!
చిన్నప్పుడు బజారుకెళ్ళి,
అన్నీచూసి కూరలు, వెచ్చాలుతెచ్చేవాళ్ళం, మరిఇప్పుడో, అన్నీ ఆన్ లైన్!
చిన్నప్పుడు, బ్యాంకుకెళ్ళి
డబ్బులుతెచ్చి, అద్దె, పనిమనిషి , పాలకిచ్చేవాళ్ళం,
మరిఇప్పుడు, గుగుల్ పే, ఫోన్ పే,
డబ్బులు లెక్కపెట్టే పనేలేదు!
అంతరిక్ష పయనాలు, చందమామకు రాకపోకలు,
శాటిలైట్ సౌకర్యాలు, ఇంత దినదినప్రగతి సాధించిన మనిషి, ఆశ్చర్యంగా,
మానవత్వం, జాలీ, ప్రేమ, దయ చూపించడంలో
వెనకబడ్డాడు, గిరిగీసుకొని, అనుబంధాలు తెంపుకొని, లోకమంతా కాసులోదేగా అనుకుంటున్నాడు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!