జీవిత సాఫల్యం

జీవిత సాఫల్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

జన్మానామ్ మానవ జన్మ దుర్లభం
యుక్తా యుక్త విచక్షణను కలిగి
మంచి చెడులను తెలుసుకుని
శరీరం, యవ్వనం అశాశ్వతమని
ప్రజలంతా పరమేశ్వర ప్రతిరూపాలని
తెలిసో తెలియకో చేసిన చెడు పనులను వదలి
ఏకాగ్రత, చిత్తశుద్ధి, వజ్రసంకల్పమే జీవన
సాఫల్యత కు ప్రధానమన్న
స్వామి వివేకానందుని,
ఆసూయ, ద్వేషాలను చూపక శాంతి, అహింసలే
ప్రగతికి సోపానాలు అన్న
జాతిపిత మహాత్ముని,
ప్రేమించే పెదవుల కన్న
సహాయం చేసే చేతులు మిన్న అని జీవితపర్యంతం
అభాగ్యుల సేవ చేసిన
మథర్ థెరిస్సా మార్గాన్ని,
కలలు కనండి ఆ కలలను నెరవేర్చుకునేందుకు
అవరోధాలు ఎదురైన నిరంతర సాధన చేస్తే
లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు అన్న భారతరత్న భరతమాత ముద్దుబిడ్డ
డాక్టర్ అబ్దుల్ కలామ్ గారి అడుగుజాడల్లో పయనించి కొత్తజీవితం ప్రారంభిద్దాం
సమసమాజాభివృద్ధి చేసి
వసుదైక కుటుంబానికే ఆదర్శంగా నిలుద్దాం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!