ఎదురుచూస్తున్నాం

ఎదురుచూస్తున్నాం..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చెళ్ళపిళ్ళ సుజాత

వసంతుని ఆగమనంతో
రానే వచ్చింది శుభకృత్
అరవై వత్సరాల తర్వాత ఎంతో పరవశంగా
నవ ఉగాదికి నాంది పలుకుతున్నానంటూ
భరోసా ఇస్తోంది
కరోనా కరాళ నృత్యాన్ని కాలరాస్తున్నానంటూ..అభయ హస్తాన్ని అందిస్తోంది
జగమంతా ఇక ఆనంద సందోహాలే
సంబరాల సందడిలో పచ్చతోరణాలే అంటూ
గతం చేసిన గాయానికి ధైర్యాన్ని రంగరించి మందువేస్తూ…
నవ్య బాటలో నడవాలని జగతిని జాగృతం చేస్తూ
ఈ ఉగాది అందరి మదిలో
ఆనందాల జల్లులు కురిపించాలని
దూరమైన బంధాలు అనుబంధాలు
చిగురులు తొడగాలని
మళ్లీ తెలుగు వాకిళ్లన్నీ సంతోషాల కాంతుల్లో వెలిగిపోవాలని
అదే తన ఆకాంక్ష అని నిర్భయంగా..నిశ్చయంగా..తెలిపిన ఉగాది కన్యకా..
నీకు మా అందరి తరుపున
ఘనమైన ఆహ్వానాన్ని పలుకుతూ.
మా పట్ల నీ కున్న వాత్సల్యానికిమురిసిపోతున్నాం..
కరోనా రహిత సమాజానికై
స్వాగతం పలుకుతున్నాం
నవ ఉగాదిన  నవ్య కాంతుల కై ఆశ పడుతున్నాం
పూర్వ వైభవ జీవన సరళికై ఎదురు చూస్తున్నాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!