ఇకనైనా మేలుకో

ఇకనైనా మేలుకో

రచన:- కమల ముక్కు (కమల’శ్రీ’)

యువతా!!!
ఎటువైపు నీ పయనం

పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో
చరవాణిలో ఆటలాడుతున్నావు//

మెదడుకు పదును పెట్టే
పదవినోదం పూరించే వయసులో
మత్తు పదార్థాలను తీసుకుని
మెదడు మొద్దు బారేలా చేస్తున్నావు//

ఆటపాటలతో వ్యాయామాలతో
శరీరానికి శ్రమ కలిగించడం మాని
గంటల తరబడి టీవీలకు
అతుక్కు పోతున్నావు//

స్నేహితులతో సరదాగా కలిసి
కబుర్లాడటం మాని
వాట్సప్ లూ ఫేస్ బుక్ ల్లో
ఛాటింగులు చేస్తున్నావు//

పెద్దవారిని ప్రేమగా పలకరించడం
వారి అవసరాలను తీర్చడం మాని
చీటికీ మాటికీ
వారిని చీదరించుకుంటున్నావు//

నువ్విలాగే ఉంటే
నువ్విలానే చేస్తే
యువతే దేశానికి వెన్నెముక
అన్న మాటలు ఏమౌతాయి//

ఇకనైనా మేలుకో
జడత్వం వీడు
అంతర్జాల మాదక ద్రవ్యాల టీవీల
మహేంద్రజాలం లో మునిగిపోకుండా
నిన్ను నీవు తీర్చిదిద్దుకో//

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!