నిశిలో పసికూన

అంశం: నిశిరాతిరి

నిశిలో పసికూన
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

ఓ నిశిరాతిరి సమయాన
వినిపించింది నాకో ఆర్తనాదం
చెత్తకుండీలోపల ఓ పసికూన
అభం శుభం తెలియని ఆర్తనాధం

శశి లేని నిశిలో
పసికూన మసిబారి
చెత్తలో చెత్తగా
చిత్త చిత్తగా

ఏడుస్తూ రోదిస్తూ
అమ్మఒడి కానీ
అమ్మలేని ఈ కోన
నిశిరాతిరిలో

నాకెవరు తోడు
నేనెవరికి వద్దా అంటూ
దరి చేర్చుకోమని
ఆకలి దప్పిక తీర్చమని

కెవ్వు కెవ్వున పెట్టిన
రోధన వేదన
ఆ పసి మనసు ఆవేదన
ఎవరు తీర్చగలరు ఆర్చగలరు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!