నిశిలో శశి!

అంశం: నిశి రాతిరి

నిశిలో శశి!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

నిశిరాతిరి చోరులకు, జారులకు నిలయము,
దయ్యాలకు,పిశాచాలకు
ఆలవాలము,
నిశ్శబ్ద నిశి తమస్సుకు సంకేతం,
చుట్టూతా చీకటుందని
తిట్టుకుంటూ కూర్చోవటం కన్నా,
నిశిలో శశిలా వెండి వెన్నెలను పంచాలీ,
ఆర్తులకు,అనాధలకు,
పూర్ణచంద్రుడిలా వెలుగులతో సహాయం చెయ్యాలీ,
తళుకబెళుకు తారకలా
మినుకు మినుకుమంటూ
దారిచూపాలీ,
మొక్కవోని ధైర్యమే నీ ఆయుధం,కాంతులు చిందే
చందమామే నీకు స్పూర్తి,
నిశిరాతిరిని
చూసి భీతిచెంతకు,
మరో సూర్యోదయముంది,
కొత్తదారులు,అవకాశాలు
తలుపు తెరుచుకుంటాయి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!