కవనమహారాజు

కవనమహారాజు

రచన: మీసాల చిన గౌరి నాయుడు

కవన లోకాన వెలసిన కవిరాజు,
మన సాహితీరారాజు బాపిరాజు,

కళాశాలకు అధినేతగా
చదువులమ్మ ఒడిలో సేదదీరిన చదువుల మారాజు మన బాపిరాజు,

పత్రికా ప్రపంచాన ముసురుకున్న చీకట్లను కలంకాగడాతో
వెలుగునింపిన
అక్షర మారాజు మన బాపిరాజు,

ఉద్యమంలో ఊపిరై
పోరాటంలో అక్షరమై
ఎలుగెత్తి నినదించిన
స్వాతంత్ర్య కెరటపు
రారాజు మన బాపిరాజు,

కుంచెకు రంగుల చీరను కట్టి, చిత్రములను చిత్రముగా చిత్రించిన చిత్రమహారాజు మన బాపిరాజు…

అక్షరాలతో మచ్చికచేసుకొని,
అందమైన సాహితీ కన్యను రూపొందించిన అక్షరరాజు
మన బాపిరాజు…

అందుకే ఆయన
ఎప్పటికీ ఒక కవనమహారాజు..
జనహృదిలో నిలిచిన
మనసున్నమారాజు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!