మెరుపులు

మెరుపులు

రచన:: నారుమంచి వాణి ప్రభాకరి

అభిజ్ఞ ఈ తరం తెలివైన అమ్మాయి ఐ ఎ ఎస్ చదవాలని కోరిక ఇంటర్ కాలేజి టాప్ ర్యాంక్ డిగ్రీ కూడా యూనివర్సిటీ ఫస్ట్ అన్నగారు ఇంజనీర్, అక్క శైలజ కెనడాలో డాక్టర్ చేస్తోంది

వాళ్ళ వాళ్లకు పెళ్లి చెయ్యడం. కస్టము ఐయ్యింది ఆమెను పెళ్లికి ఒప్పించడం మరీ కస్టమ్ అయింది అది ఒక సమస్యగా మారింది చదువుకున్న పిల్లలు ఒక పట్టాన ఒప్పుకోరు.
ఆదేశం వెళ్లే పిల్లాడు కావాలి అది దాని ఉద్యోగం వదిలి రాదు. అలా వారి చుట్టాల్ లో దొరకడం కష్టం అయింది పెద్ద పజిల్ అయింది చివరకు సుఖాంతం అయింది అయితే తల్లి తండ్రి చాలా కష్ట పడ్డారు

పిల్లల్ని కనడం వారిని పెద్ద చదువుకి కావాల్సిన పరీక్షలు
అవసరమైన విద్యను చెప్పించడం అతరవువాత
పెద్ద ఉద్యోగాలు చేరడం పెళ్ళిచేసుకుని స్థిరపడ్డమాంటే
ఒక పఠాన కుదరదు
చదువు అంటే తెలివి డబ్బుతో సరి కానీ పెళ్లి అనగానే రెండు కుటుంబాలు కలయిక ఇది మరీ కష్టంగా ఉన్నది

ఏ పిల్ల జీవితం ఆ పిల్లది కదా కనుక ఎవరి ప్రజ్ఞ వారిది
అయితే అభిజ్ఞా ఊరుకుంటుందా మళ్లీ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నది ఆమె పట్టుధలగా సివిల్స్ కి వెళ్ళాలని పట్టు పట్టింది

పూర్వం ఎనిమిది పది మంది పిల్లలను కని సమర్థవంతంగా జీవితాలు సాగించే వారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురితోనే ఎన్నో సమస్యలు .తల్లి తండ్రి అంటే పిల్లల కోర్కెలు తీర్చి పెళ్లి చెయ్యాలి. ఇది వారి భాధ్యత కూడా..

అభిజ్ఞ పట్టు పట్టి సివిల్స్ సాధించింది. తల్లి తండ్రి అమె మాట కాదనలేక మౌనంగా ఉండి.బాధ పడ్డారు తన పిల్లల తెలివి కి సంతోషించక ఏమిటి ఈ బాధ అని తర్కించు కొన్నారు

కూతురు మేడలు కడుతోంది.కానీ ఆశా సౌధాలు జీవితంలో జరగడం చాలా సమస్య పిల్ల ఎంత చదివినా సంపాదిస్తున్న పెళ్లి చెయ్యకుండా ఉండలేము

దానికి తగిన సంబంధం దొరకడం ప్రశ్నార్థకమే అంటూ ఆలోచించారు.

కానీ అభిఙ్ఞ అడపులిలా విరుచుకు పడింది ఊరుకో లేదు పాత చింత కాయ పచ్చడి భావాలు మానండ్ నీ కొప్పడి
తల్లి తండ్రి సమర్థించింది పోయి వద్దు అంటారు ఏమిటి?
ఆడపిల్లని విమర్శించ కూడదు

కానీ అన్నగారు మాత్రం ఆడపిల్ల ఐ ఎ ఎస్ చదివినా
అంతరిక్షం వెళ్ళినా వచ్చినా పెళ్లి తప్పదు పిల్లలను కనడం తప్పదు కనుక చదివింది చాలు
నా ఫ్రెండ్ ఇంజనీర్ మంచి కుటుంబం ఉన్నది వాళ్ళు నిన్ను చూశాడట ఇష్ట పడుతున్నాడు కనుక పెళ్లి చేసుకుని హాయిగా. సెటిల్ అయి పో అన్నాడు నాన్న అమ్మ సంతోష పడతారు అన్నాడు.
ఓను అన్నయ్య అక్క పెళ్లి విషయం లో చాలా కష్ట పడ్డారు. ఒకే అయితే ఒకే కండీషన్ అన్నది

సరే చెప్పు అన్నాడు

పెళ్లి తరువాత సివిల్స్ లో సెలెక్ట్ అయి పోస్టింగ్ ఇస్తే
వాళ్ళు వద్దు అనకూడదు .రాస్తే తను నెగ్గుతుంది అన్న ధీమా ఉన్నది

అదేవిధంగా.తన ఫ్రెండ్ సత్యారావు ఇంట్లో ఈ విషయం చెప్పాడు

ఒకే అంతా కన్నన్నా కలెక్టర్ కోడలయితే ఎంత సంతోషం
అన్నారు నాకు చదువు అంటే ఇష్టము అభి పి హెచ్ డి చేసిన సివిల్స్ నిగ్గినా ఆనందమే అని ఒప్పుకున్నారు

అభిఙ్ఞ పెళ్లి సింపుల్ గా చేశారు

సివిల్స్ రాసింది అలాగే జిల్లా కలెక్టర్ గా గాక మినిస్ట్రీ లో జాబ్ లో చేరింది. ఇద్దురు పిల్లలకు తల్లి అయ్యాక
పిహెచ్ డీ కి అప్లై చేసి డాక్టరేట్ పొందింది సహకరించే భర్త ఉంటే స్త్రీ అన్ని విజయాలు సాధించగలదు దానికి తోడు అత్తగారు పిల్లల్ని చూసుకునేది.

మనసున్న భర్త దొరకడం అదృష్టం మార్గం అదే వస్తుంది
ఎదగాలనే ఆడవారిని ఎదగ నివ్వడం అత్తింటి వారు ప్రోస్థాహం ఇవన్నీ స్త్రీల సౌభాగ్య ము కొందరు పెళ్లి తరువాత చదువా అంటారు కానీ సంస్కార వంతులైన అత్ఛవారు కోడలు జీవితానికి మరిన్ని మెరుగులు మెరుపులు అందిస్తారు. అత్త గారు అయా కూడా ఉండి పిల్లల పెంపకంలో.సహాయ పడేది ఇంటికి రాగానే సత్య రావు పిల్లలను ఇష్టంగా.ఆడించే వాడు.
పిల్లలను ఎంత ప్రేమగా పెంచితే అంతా తెలివి తేటలు వస్తాయి భయంతో బెదిరిస్తూ పెంచకూడదని అతని భావం అలాగే తన పిల్లలను జాగర్తగా చూసేవాడు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా భార్య పిల్లల విషయంలో చూసుకోవాలి తగినంత ప్రేమ అందించాలి.అప్పుడే కుటుంబాలు బాగుంటాయి.
ఆత్మీయత అనురాగం వ్యక్తుల మధ్య ఉండాలి ఎక్కడినుంచి వచ్చినా ఆ ఇంటి కోడలు కనుక ప్రేమ గా చూడాలి ఆమె పై విమర్శ బాణాలు వెక్కిరింత హాస్యాలు.కూడదు ఇవన్నీ.పిల్లలకి తల్లి తండ్రుల.నుంచి వస్తాయి
తల్లి పెంపకం బాగుంటే ఈ సమస్యలు రావు .చాలా కుటుంబాలలో అత్త గారు తన కొడుకు 30 ఏళ్లు పెంచి
సమర్ధుడైన కొడుకుని కొడిలికి అప్పచెప్పామనే భావన ఉంది.
అయితే అందరి జీవితాలు అలా కుదరవు ఎక్కడో అదృష్ట.వంతులు ఉంటారు. అనుకున్నారు.
అభీజ్ఞ చాలా తెలివైనది .కుటుంబ సభ్యులకు ఎవరుకి లోటు రాకుండా చూసింది.ఇంట్లో అత్త గారు ఉండేది
ఆవిడ చాలా సౌమ్యమగ ఉండేది. కొందరు అత్తగారు లు తనకొడుకు వచ్చిన పిల్ల మాట వింటున్నాడు 30 తన పెత్తనం పోయింది అని కోడలు పై ఆంక్షలు పెడతారు కొందరయితే కోడలు ఉన్నతి చూడలేక ఈ ర్థ్య పడి గొడవలు తెస్తారు నా కూతురు అత్తింటి అల ఉంది నువ్వుకూడా అలా ఉండు ఇలా ఉండు అంటారు కాని అభిఙ్ఞ అత్తగారు కోడలు ఉన్నతి కోరింది అందుకే సుఖ పడింది కూడా
అదే భావనతో కొడుకుని అనలేక.కోడల్ని సాధిస్తూ ఉంటుంది అది కొడుకు గ్రహించి తనకోసం తన ఇంటికి
వచ్చిన భార్యను జాగర్తగా చూడాలి అంతే గాని. పురుష.అహంకారం చూపా రాదు అని తెలుసుకోవాలి తన వాళ్ళకి బట్టలు వస్తువులు కొని తెచ్చి నప్పుడు తన అక్క చెల్లెళ్ల గారంగా చూసి నప్పుడు తన భార్యను చూడాలని ఎందుకు తెలుసుకోరు అందుకే.సత్య రావు భార్యను ప్రేమగా చూసుకోవడం గాక చదువు కూడా చెప్పించాడు.
ఏమి అయిన స్త్రీ జీవితం అత్తింటి తో ముడి పడి ఉంటుంది అందుకు అత్త వారి.సహకారం కావాలి వారి
పనులు వారికి రావలసిన వస్తువులు అడిగి పుచ్చు కున్నప్పుడు మరి.తన భార్య తరుపు వారిని కూడా చూసుకోవాలి .
అయితే ఇప్పుడు కుటుంబాలకు వచ్చి పోయే వారు లేరు తినే వారు లేరు.అందుకే ఆ కట్టుకున్న భార్యను
సమంగా చూస్తే చాలు అనుకున్నాడు.
ఏది ఎలా ఉన్నా అభీజ్ఞా ఈతరపు అదృష్ట వంతురాలు
అమే జీవితంలో అన్ని కలలు మెరుపు కలలు.అందుకే ఆమె జీవిత లక్ష్యాలను సాధించడానికి భర్త అత్త సహకారం అందించారు.ఎంత మంది స్త్రీలకు ఇలాంటి
యోగం ఉంటుంది ఒక్క సారి ఆలోచించండి.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!