అంగడి సరుకు

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

అంగడి సరుకు

రచయిత :: వాడపర్తి వెంకటరమణ

అక్కడ చీకటి రాజ్యమేలుతూంటుంది/
అక్కడ డబ్బుగాలి ధాటిగా వీస్తూంటుంది/
మేకతోలు కప్పుకున్న పులి తలల దందాలు/మానవత్వం ముసుగులో షురూ అవుతుంటాయి/

వాళ్ళు రక్తదానం మహాదానమంటూ ఊదరగొట్టి/
రక్తాన్ని జలగల్లా పీల్చి ఆ రక్తధారలో/
తనివితీరా అభ్యంగనస్నానం చేస్తారు/

వాళ్ళు నేత్రదానం మరొకరి కంటికి వెలుగని చెప్పి/
చూపుల గారడీ మంత్రంతో కళ్ళను పెరికేసి/
కనికరం లేకుండా గోళీలాడుకుంటారు/

వాళ్ళు అనాథలకు ఆపన్నహస్తమంటూ/
అందినకాడికి లక్షణంగా లక్షలు పోగేసి/
పేదల బతుకులపై నాట్యం చేస్తుంటారు/

మానవత్వానికిప్పుడు దిక్కు తెలియక/
మోసగాళ్ళ చేతిలో అంగడి సరుకయ్యింది!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!