పుణ్యలోకం

పుణ్యలోకం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: యాంబాకం

ఒకసారి నారదుడు విష్ణుమూర్తి, లక్ష్మిదేవిలను వైకుంఠంలో దర్శనం చేసుకునీ సరాసరీ కైలాసం కూడా పోయాడు పార్వతీ పరమేశ్వురుల దర్శనార్థం. కానీ అక్కడ పార్వతీ పరమేశ్వరులు, నంది మీద ఆశీనులై కాశీపట్టణం మీదుగా విహారిస్తున్నారని తెలిసి! నారదుడు పరుగు పరుగున బయలుదేరారు. కాశీకి అక్కడ వేలకొద్ది భక్తులు గంగాలో స్నానాలు చేస్తూ కనిపించారు. మరి కొందరు, శివున్ని దర్శించుకొంటున్నారు. ఇంకా కొందరైతే కానుకలు సమర్పిస్తూ కనపడగా, మిగిలిన వారు భజనలు చేస్తున్నారు. కానీ నారదుడికి పార్వతీ పరమేశ్వరుడు మాత్రం కనిపించలేదు. చిన్నగా ఆకాశ మార్గం నుండి దిగి నేల మీదకి వచ్చి కాశీపట్నం అంత వెతకసాగాడు.
ఇక్కడ పార్వతీదేవి భర్తతో “నాధా!.. ప్రతిరోజు నిన్ను సేవించటానికి ఇంత మంది భక్తులు ఈ కాశీపట్టణానికి వస్తున్నారే! వీరంతా నీ సాన్నిధ్యం పొందే వారే అయితే? అందరూ కైలాసం చేరితే కైలాసం సరిపోతుందా! స్వామి?అని అనుమానంగా అడిగింది.
అందుకు శివుడు “దేవి నీవు ఒట్టి అమాయకురాలువే! కాశీకి వచ్చినంత మాత్రాన పతి వాడూ భక్తుడు పరమ భక్తుడై పోయి కైలాసం చేరుకుంటాడు అనా నీ అభిప్రాయం?
పుణ్యక్షేత్రాలు దర్శించక పోయినా, పుణ్యలోకం పొందవచ్చును. నా సన్నిధికి రా గలవాడు. ఎటువంటివాడు ఐవుండాలో ఇప్పడే ఇక్కడే నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను.” అన్నాడు విశ్వశ్వరుడు.
ఇక్కడ నారదుడు పార్వతీ పరమేశ్వరులు ఉన్న చోటుకు రాబోవు సమయానికి ముష్టి వారుగా మారిపోయి గుడి దగ్గిరికి చేరి అక్కడ “ఒక చెట్టు కింద కూర్చుని అవసానదశలో బాధ పడుతూ శివుడు, బాధ పడే ముసలి భార్యగా పార్వతీ నటించ సాగారు.”
గుడి దగ్గర నారదుడు పార్వతీ పరమేశ్వరులను గుర్తించలేక అజ్ఞానంగా తిరగసాగాడు. ఆ వేల భక్తుల మధ్య దేవాలయం దగ్గర స్వామిని దర్శనం కోసం ఎందరో భక్తులు ఎక్కడెక్కడో నుంచో వస్తూ పోతూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడ ముష్ఠ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల కేసి చూడనే లేదు. కొందరైతే చూచి చీదరించుకొని పోతున్నారు.
ఇంతలో ఒక సన్యాసి భక్తుడు వచ్చాడు అతనిని చూసి వృద్దరూపంలో ఉన్న పార్వతీ “బాబూ ఈయన నా మొగుడు చావటానికి తొందరపడు తున్నాడు. నాకు మసకగా ఉంది. కాసిన్ని నీళ్లు గొంతులో పోసి పుణ్యం కట్టుకో బాబు అంది ప్రార్థన” కానీ ఆ సన్యాసి భక్తుడు విసుకుని “ఇలా ఎక్కడ చూసినా ముష్టి వెధవలే మీకు అందరికీ నీళ్లు పోస్తూ కూర్చుంటే ఇక ఐయినట్టే. బోలేడంత ఖర్చులు పెట్టి కాశీపట్నం వచ్చినది ముష్ఠ గొంతులో నీళ్లు పోయడానికేనా? అని వెళ్ళి పోయాడు.
కాసేపు తరువాత ఇద్దరు దంపతులు గుడి వైపు పోతుండగా వృద్దరూపంలో ఉన్న పార్వతీ వారిని దయతలచి నా భర్త చనిపోయే లాగున్నాడు. నాకు మసకగా ఉంది. కాసిన్ని ఈ గంగా తీర్థం ఆయన గొంతులో పోయియండి బాబు అని అడిగింది. దీనంగా! దంపతులలో మగమనిషి తీర్థం పోయబోయాడు. కానీ అంతలోకి ముష్ఠ రూపంలో ఉన్న పార్వతీ “ఇదిగో నాయనా! నువ్వు నీళ్ళు పోసి నా భర్త దాహం తీర్చటానికి ముందు ఒక నియమం వున్నది. నీకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఏ పాపమూ చేయకుండాలి అలా ఐయితేనే తీర్థం పొయ్యి అబద్ధం ఆడకు నువ్వు అబద్ధం ఆడినట్టియితే నాభర్త చనిపోతే, ఆ పాపం నీకు చుట్టు కొంటుంది. అని చెప్పింది.
ఈ మాటలు విని పక్కనే ఉన్న భార్య “పూటకు గతిలేదు వాళ్ళకి నియమాలు కూడిన? ఐయినా ఒకవేళ ఆ ముష్ఠ ముసలి వెధవ చస్తే ఎందుకు, పోతే ఎందుకు, అని నోరుపడేసుకొంది. ఈ దిక్కుమాలిన పనులు చేయడం ఎందుకు మనం వచ్చిన పని మానేసి ముసలోడు చచ్చే ఆ పాపం తెచ్చుకొంటావా,ఎంది.? అని భర్త మీద విరుచుకుపడి. భర్తతో కలసి దంపతులు వారి దారిన వారు వెళ్ళి పోయారు.
ఇక్కడ నారదుడు పక్కనే ఉన్న పార్వతీ పరమేశ్వరులను కనుక్కొన లేక నారాయణ నారాయణ అంటూ దేవాలంచుట్టూ తిరగ సాగాడు. తరువాత మళ్ళీ కొన్నిగంటల వరకూ తీర్థయాత్రలకు వచ్చిన వారు ఆవృద్ధుల రూపంలో ఉన్న పార్వతీ శివుని పట్టించుకోలేదు. తరువాత అటుగా ఒక బోయవాడు గుడి దగ్గర చిన్న చిన్న వస్తువులు అమ్ముకొంటూ స్వామిని దర్శంచుకుని ఆ దారినే వచ్చాడు. ఆ ముష్ఠ వారి కేసి చూసాడు. వెంటనే ముసలి రూపంలో ఉన్న పార్వతీ బోయిని తన భర్త దాహంతో ఉన్నాడని తన గొంతులో కాసిన్ని నీళ్ళు పోయమని తనకు మసగా ఉందని, కానీ! నీకు ఊహ వచ్చినప్పుడు నుంచి పాపంచేసి ఉండకూడదు అని షరత్తు పెట్టగా బోయి విని మొదట ఆశ్చర్యపోయాడు.
బోయవాడు ఒకసారి ఆవృద్దుల ముఖంలోనికి పరీక్షగా చూడగా! వెంటనే వాడికి వారిలో ఏదో ఒక దివ్యమైన తేజస్సు కనబడుతున్నట్టు తోచింది.
బోయి ఇలా! తన మనసులో ఇట్లా అనుకొన్నాడు. “పుట్టినప్పటి నుండి ప్రతి జీవి ఏదో ఒకటి పాపం మూటకట్టుకునే ఉంటాడు. పాపం చెయ్యని మానవుడు ఉంటారా? ఎవడు లేడు. నేను బొయగా పుట్టి, నా వృత్తి జీవహింస. ఆ శివుడు నాకు కల్పించిన వృత్తి అది. ఈశ్వరుడు కల్పించిన వృత్తికి నేను బాధ్యున్ని కాదు కదా! అయితే, ఈ వృద్దులు సామాన్యలు కారు. సామాన్యులైతే ఈ దివ్య తేజస్సు ఉండదు. వీరు నిశ్చయంగా ఎవరో మహనీయులు.
“పోతే నేను ఇప్పటి వరకు చేసిన పాపాలు తోంబైతొమ్మిది! అనుకొంటే ఈ దంపతులు సామాన్య మానవులే ఐతే నేను పోసే తీర్థం వలన ఈ ముష్ఠ ముసలి చని పోతే. నేను చేసిన తొంబైతొమ్మిది పాపాలతో కలసి ఇది నూరవది అవుతుంది. అలా కాకుండా వీరు ఎవరో మహానుభావులు అయితే నా పాపాలన్ని తీరిపోగలవు. అనుకుని బాగ నిశ్చయంతో ‌భక్తి పూర్వకంగా ఆ ముష్ఠ ముసలి నోరు తెరిచి గంగతీర్థం పోయగానే. ఆక్షణమందే ఆ ముష్ఠ దంపతులు మాయమై వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కారించారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీతో చూచినా!? ఈ బోయి భక్తి నిబ్బరం? వీడునన్ను నమ్ముకొని ఉన్నాడు.
పవిత్ర మైన హృదయం కలిగి ఉండటంచే తన పాపాలన్ని మన దర్శనం చేసుకొని పాపలు పోగొట్టు కున్నాడు. ఇటువంటి భక్తులు మాత్రమే కైలాసంలో ఉండటానికి అర్హలు, నిజమైన భక్తులు, కానీ ఉత్తుత్తి పూజలు చేసేవాళ్ళలంతా భక్తులు కాలేరు. వాళ్ళకి నా సాన్నిధ్యం పొందలేరు. అని శివుడు పార్వతితో చెప్పాడు. తరువాత బోయివాన్ని ధీవించి అక్కడ నుంచి నందితో పాటుగా కైలాసం వెళ్ళి పోయారు. శివపార్వతులు. ఇది అంతానూ నారదుడు చూస్తూనే ఉన్నాడు.
ఆక్షణంలోనే బోయవాడి కొసం ఒక పుష్పక విమానం వచ్చి ఆతన్ని పుణ్యలోకానికి తీసుకు పోయింది.

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!