కారుణ్యం

కారుణ్యం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

“ఏవండీ, ఇవాళ మన ఇంట్లో’ శ్రీ సత్యనారాయణ స్వామి’ వారి వ్రతం చేస్తున్నాము, మా అమ్మగారు ప్రసాదం కూడా తయారు చేస్తున్నారు, ఇంకాసేపట్లో పూజారి గారు వస్తారు, మీరు తొందరగా తయారవ్వండి! అని గట్టిగా అరిచింది వరలక్ష్మి. ఆ కేక విన్న ‘శ్రీహరి రావు గారు’ గబగబా కాఫీ తాగేసి స్నానానికి వెళ్లి పట్టు పంచె, కండువాతో తయారై పీటల మీద కూర్చున్నారు.
భార్య 2 రోజులలో ‘డెలివరీ కోసం’ పుట్టింటికి వెళ్ళిపోతుంది, అందుకని వాళ్ల అమ్మగారు దగ్గర ఉండి ‘సత్యనారాయణ స్వామి వ్రతం ‘, అసలే నెలలునిండిన వరలక్ష్మి ఎన్నో ఆశలతో ఆ వ్రతం భర్తతో చేయించి, తను మాత్రం దూరంగా కూర్చుని పూజ చేయిస్తున్నాది, శ్రీహరి రావు గారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ గావించి, అత్తమామలకు నమస్కారాలు చేసి, తన ఆఫీస్ కి ఆ ప్రసాదం ఓ బాక్స్లో పెట్టుకొని హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయాడు.
వరలక్ష్మి కూడా ఒక పెద్ద హోటల్లో ‘టేబుల్ ‘ఇన్చార్జిగా ‘పనిచేస్తుంది, ఆ రోజే ఆఫీసులో ఆఖరి రోజు కావడం వలన, తను కూడా తయారై తల్లికి అన్నిచెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది.
శ్రీహరి రావు గారు ఆరోజు బైక్ మీద ఆఫీస్ పని మీద విజయనగరం వెళ్లారు, పని అయ్యేసరికి రాత్రి అయిపోయింది, వెంటవెంటనే ఒక మంచి స్ట్రాంగ్ టీ తాగి బైక్ స్టార్ట్ చేసి విశాఖపట్నం బయల్దేరారు, అలా ఒక పావు గంట గడిచేసరికి కల్ల హైవేలో అంతగా ట్రాఫిక్  లేకపోవడం వలన కొంచెం స్పీడ్ గానే వస్తున్నారు, దూరంగా చీకటిలో ఒక చెట్టు కింద ఒక కారు ఆగిపోయి ఉంది, బైక్ స్లో చేసి  మెల్లిగా ఆ కారు దగ్గరికి వెళ్లేసరికి ఆశ్చర్యపోయారు, ఒక పెద్దావిడ నిస్సహాయంగా కారులో కూర్చుని చెయ్యి ఊపింది ,శ్రీహరి రావు తన బైక్ ని ఆఫ్ చేసి కారు దగ్గరికి వెళ్లి తలుపు కొట్టాడు, ఆవిడ తలుపు తియ్యకుండానే గ్లాస్ దించి’ బాబు నా కారు టైర్ పంచర్ అయిపోయింది, ఎంత మందిని అడిగిన సహాయం చేసే వారు లేరు, అర్ధరాత్రి అయిపోతుంది, ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమోనని ,చూస్తున్నాను అని  ఆవిడ ఏడుస్తూ చెప్తుంటే సరికి శ్రీహరి రావు గుండె కదిలిపోయింది, ఉండమ్మా! ఏడవకండి, నాకు టైర్ మార్చడం వచ్చు మీ దగ్గర ‘స్తెఫిని టైర్ ‘ఉందా, ఉంటే 15 నిమిషాల్లో  టైరు మారుస్తాను, అనగానే వెంటనే ధైర్యం తో ‘ఉంది బాబు, టైర్ మార్చడానికి కావలసిన టూల్స్ కూడా ఉన్నాయి, అంటూ డిక్కీ డోర్ తెరిచి స్పేర్ టైరు దానికి కావలసిన సామాన్లు శ్రీహరి రావు కు ఇచ్చింది, అన్నట్లుగానే పంచర్ అయిన టైర్ తీసివేసి ఇంకో టైర్ బిగించి బాగా టైట్  చేసి, “అయిపోయింద అమ్మ, ఇక మీరు సంతోషంగా వైజాగ్ వెళ్ళిపోవచ్చు”,అని అనగానే ఆ పెద్దావిడ పేరు’ పద్మావతి’ అమ్మగారు, శ్రీహరి రెండు చేతులు పట్టుకుని “నువ్వు ఏ పుణ్యమూర్తి కన్న కొడుకువో, ఈరోజు దేవుడిలా వచ్చి నాకు సాయం చేశావు, మీ రుణం తీర్చుకోలేము” కానీ ఇది నా సంతోషం కోసం అంటూ’ 500 రూపాయలు ‘ఇవ్వబోయింది, అదేంటమ్మా! ఆపదలో మీరు ఉన్నారు, అందులోనూ ఈ పెద్ద వయసులో రాత్రి పూట ఒంటరిగా ప్రయాణం ఏంటమ్మా,? అనగానే’ ఏం లేదు, బాబు నేను ఇవాళ రిటైర్ అయ్యాను నా ఫ్రెండ్స్ అందరు ‘విజయనగరం ‘ లో ఉన్నారు వారిని రేపు వైజాగ్ లో నేను ఇచ్చే పార్టీ కి రమ్మని ఆహ్వానించడానికి వెళ్లాను, అనుకోకుండా లేట్ అయిపోయింది, వస్తుంటే నా కారు ‘టైర్ పంచర్ ‘అయిపోయింది, ఏం చేయాలో, పాలుపోని పరిస్థితులో దేవుడిలా వచ్చి ఆదుకున్నారు, అనే ఆవిడ చెప్తుండగా “పోనీలెండి, మీరు ఇంకా హాయిగా వైజాగ్ వెళ్ళిపోవచ్చు పని చేసినందుకు నాకు డబ్బులు ఇచ్చి అవమానించ వద్దు, నా తల్లికి నేను చేశాను, ఇక మీరు పదండి, మీ వెనకాలే బైక్ మీద నేను వైజాగ్ వరకు వస్తాను మీరు ధైర్యంగా ఉండండి” అంటూ అంటున్న శ్రీహరి  తల నిమిరి” నీకు అన్ని శుభాలు జరుగుతాయి నాన్న”! అంటూ కళ్ళు తుడుచుకొంటూ కారు స్టార్ట్ చేసి వెళ్లిపోయారు పద్మావతి అమ్మవారు.
ఆ మర్నాడు ‘పద్మావతి అమ్మగారు తన ‘ రిటైర్మెంట్ ఫంక్షన్ ‘ఒక పెద్ద హోటల్లో జరుగుతుంది, అందరూ అభినందనలు చెప్తున్నప్పుడు తన స్వీయ అనుభవాలు గురించి పద్మావతి అమ్మ గారు మాట్లాడుతూ, నిన్న రాత్రి జరిగిన సంఘటన అదే శ్రీహరి అనే అతను అర్ధరాత్రి నా కారు టైర్ పంచరు అయిపోతే ఏమీ ఆశించకుండానే కారు టైర్ మార్చి తన సహృదయాన్ని చాటుకున్నాడు, అతనికి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను, అంటూ అందరికీ చెబుతూ భోజనాలు చేయసాగారు.
అందరూ భోజనాలు చేసి వెళ్లిపోయాక, తన టేబుల్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ‘హోటల్ బిల్లు ‘తెచ్చి  పద్మావతి అమ్మ గారికి ఇచ్చి, అమ్మ ఎలా ఉన్నాయి భోజనాలు? అన్ని బాగున్నాయా, రుచిగా ఉన్నాయా, అంటూ ప్రశ్నలు వేస్తున్న అమ్మాయి చెయ్యి పట్టుకుని “ఏమ్మా ఇదేంటి,  నీకు చూస్తే నెలలు నిండుతున్నాయి, నిండు గర్భిణివి ఇంకా పని చేస్తున్నావా? అని అడిగేసరికి “ఏం చేస్తా అమ్మ, అసలే’ కరోనా సమయం’ వచ్చేది’ సగం జీతం ‘మాత్రమే అది కూడా వదులుకోలేక, మా భార్య భర్తలు ఇద్దరం పని చేస్తే గాని గడవని బ్రతుకులు, అయినా ఇవాళ నా చివరి రోజు నన్ను మా అమ్మగారు డెలివరీ కి తీసుకు వెళ్ళి పోతున్నారు, అని ఆర్త్రం గా చెప్తున్నా ,ఆ అమ్మాయిని చూస్తూ బిల్లు కాక ఇంకొక 500 ఎక్స్ట్రా ఇచ్చి “జాగ్రత్తమ్మా నీకు మంచి కొడుకో, కూతురో పుడతారు కంగారు పడకు, జాగ్రత్త !అంటూ నమస్కరిస్తున్న అమ్మాయినీ దగ్గరకు తీసుకుని “నీకు దేవుడు అన్ని శుభాలు కలిగిస్తాడు అని ఆశీర్వదించి వెళ్లిపోయారు పద్మావతమ్మ గారు.
ఆ అమ్మాయి బిల్లు డబ్బులు కాకుండా తీస్తుంటే మరో ‘5000 రూపాయలు’ అందులో పై నోటిమీద “గుడ్ లక్” అని అని రాసి ఉండడం చూసిన అమ్మాయి ఆనందంతో హోటల్ లో బిల్లు డబ్బులు కట్టేసి, ఆ రోజు నుంచి ‘మెటర్నిటీ లీవ్’ మీద ఇంటికివచ్చేసింది వరలక్ష్మి.
ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి రాత్రి భోజనాలు ఆప్పుడు ‘!ఏమండీ,  ఇవాళ ఒక విచిత్రం జరిగింది, అదేంటోగాని దేవుడు మనకు అన్ని విధాల ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు, అనగానే శ్రీహరి రావు గారు ‘ఏంటి ఏమైంది ?అంత సంతోషంగా కనబడుతున్నావు, అని అడగగానే “ఏం లేదండి, ఇవాళ  ఒక పెద్దావిడ తన ‘రిటైర్మెంట్ ఫంక్షన్ ‘కి నేను బాగా అన్నీ అమర్చి నందుకుగాను ‘500 రూపాయలు’ టిప్పు ఇచ్చారు, అనగానే ‘వెరీ గుడ్’, అన్నాడు శ్రీహరి, అది కాదండి, ఇంకొక ‘గుప్త దానం’ కూడా చేశారు ఆవిడ, అంటూ హడావిడిగా చెప్తున్న భార్య వరలక్ష్మి ni’ ఏంటో తొందరగా చెప్పు, అసలే నేను బాగా అలసిపోయి వున్నాను ఇంకోటి ,ఏంటంటే రేపు మీరు వెళ్లడానికి కూడా డబ్బులు సర్దుబాటు కాలేదు ఎంత మందిని అడిగిన అప్పు పుట్టలేదు, నా టెన్షన్ నాది ,తొందరగా చెప్పు వెళ్లి పడుకోవాలి ,విసుగ్గా అన్నాడు శ్రీహరి,  “అబ్బా వుండండి, చెప్పేది సాంతం వినండి, అంటూ నవ్వుతూ ఆవిడ కట్టిన బిల్లు కింద మరో’5000 రూపాయలు’ పెట్టి ఒక నోటు మీద అ’ గుడ్ లక్ ‘అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది ఆ మహాలక్ష్మి, అనగానే ఆశ్చర్యచకితుడై న శ్రీహరి  అవునే, నిజంగానే ఆ దేవత సమయానికి ఎనలేని సహాయం చేశారు, ఆవిడకి ‘సంపూర్ణ ఆయురారోగ్యాలు ‘కలగాలని మనం కూడా దేవుని ప్రార్థిద్దాం! అంటూ భర్త అంటున్న మాటలు విని వరలక్ష్మి అమ్మా, నాన్న కూడా ఎంతో సంతోషంగా తన కూతుర్ని ఆ మర్నాడు పురిటి కి పుట్టింటికి తీసుకు వెళ్ళిపోయారు.
“ఈ కథలోనే దేముని చమత్కారం ఏంటంటే, పద్మావతి అమ్మ గారికి తెలియదు,వరలక్ష్మి శ్రీహరి రావు గారి భార్య అనే విషయం, ఇటు వరలక్ష్మికి తెలియదు తన భర్త పద్మావతి అమ్మ గారికి అర్ధరాత్రి సహృదయంతో సహాయం చేశాడని, అందుకే “ప్రతిఫలం “ఆశించకుండా ఎవరికైనా నా సహాయం చేస్తే ,ఆ దేవుడే మనకి మరో రూపంలో సాయం అందిస్తాడని మరోసారి రుజువైంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!