నా తొలి ప్రేమ

నా తొలి ప్రేమ

రచన: నరసింహా రెడ్డి.

తను కనిపించిన క్షణం..
నాలో నేను కాదు కాదు నాకే తెలియని నేను బయటకొచ్చాను…
తినకుండానే తియ్యందనాన్ని నా మది రుచించింది.. తాను మాట్లాడే ప్రతి మాట ముద్దుగుమ్మ కాలి అందెల సవ్వాళ్ళై నా  చెవిని రంజింప చేసాయి..
ఒక్కసారిగా రెక్కలు మొలిచ్చాయి.
నేలపైనే ఉన్న  ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది..
తన చూపు నన్ను చూస్తున్నప్పుడు హిమాలయ శిఖరాలలో విహరించినట్టు అన్పించింది..
తను నడిచిన ఆ మార్గం పూలవనం లా తోచింది… తను వదిలిన  ఊపిరి సుమ గంధం లా నను తాకింది…
పగలు రాత్రి తేడాలు మది మర్చిపోయింది.. ఆకలి నిద్ర ఊసే లేదు…
ఇంతలా నాలో ప్రేమగ్ని రాగిల్చిన నా  ప్రియాసఖీ ఇపుడు వేరొక ఇంటి దీపమై వెలుగుతుంటే …
అది చుసిన నా ప్రాణం దాహించుకు పోతుంది……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!