ఖద్దరు కార్ఖానా

ఖద్దరు కార్ఖానా

రచన: నెల్లుట్ల సునీత

నేటి రాజకీయాలుఅవినీతికి ఆనవాళ్లు/
ప్రశ్నించే గొంతుకను నొక్కేసె ఖద్దరు చొక్కాలు/

అధికార దాహంతో పీఠమెక్కిన నేతలు/
ప్రజాధనం దోచేందుకు పాకులాటలు/
మాట చాతుర్యాలతో మాయచేస్తూ/
ప్రజాస్వామ్య విలువల్ని పాతరేసే
రాచ మార్గాలు/

ఇంటికొక్క లీడరు పుట్టుకొచ్చి
ఓటు బ్యాంకుకు నోటే ఎదురుస్తుంటే
ఓటు అనే వజ్రాయుధం నోటు కింద తాకట్టే/
ఖద్దరు కార్ఖానాలో ఐదేండ్లకొక జాతర/
అన్నీ ఉచిత నజరానాల గారడీలు/
జాక్ పాట్ స్కీములలో దగా స్కాములు/

రాబందుల కోరలకు చిక్కిన రాజనీతి సూత్రాలు/
జనసామ్యమే స్వార్థమయి సీట్ల కొరకే ప్రయాస/
అసెంబ్లీ అరాచకాలు మైకులతో కొట్లాటలు/
రాజకీయ చదరంగంలో పావులు కదిపే నేతలు/
ఊసరవెల్లి ఛాయలతో పార్టీలలో మార్పులు/

అరాచకపు హస్తాల్లో బందీ అయ్యింది దేశం/
తీరని వ్యామోహ దాహం నేటి రాజకీయం
ఈ వాదం సమసిపోదా ఇకనైనా./

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!