జీవితమంటే

జీవితమంటే…..?

రచన:దోసపాటి వెంకటరామచంద్రరావు

జీవితమంటే ఒక వరం
పూర్వజన్మ సుకృతం
కొందరికి అది శాపము
ఇంకొందరికి పూలపాన్పు
మరికొందరికి ముళ్ళబాట
ఎందరికో వడ్డించిన విస్తరి
చాలామందికి అతుకులబొంత
విలాసాలమయంతో గడుపుతుంటారు
వినోదవిహారాలుచేస్తారు
జీవిస్తూ జీవింపచేస్తారు
జీవిస్తూ హింసించుతారు
పరులసోమ్ముతో బ్రతికేస్తారు
పదవులకోసం ప్రాపకాలు
పరువుపోయినా పట్టించుకోరు
పచ్చనికాపురాలలో నిప్పులు పోస్తారు
పగప్రతీకారాలతో రగిలిపోతారు
పరులకోసమే బ్రతుకుతారు
బ్రష్టులవుతారు
బలవుతారు
బాగుపడతారు
బాగుకోరతారు
జీవితం ధన్యమని భావిస్తారు
జీవితం వ్యర్ధమని మరణిస్తారు!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!