నా ప్రేమ
రచన: పి. వి. యన్. కృష్ణవేణి
ప్రేమ కోసం త్యాగం
ప్రేమ కోసం మరణం
ప్రేమ కోసం సమయం
ఆగనిదీ తరుణం.
మరణం కానే కాదు విజయం
సాధించామనుకునే అమాయకులం
ప్రేమ ఒక యాదృచ్ఛికం
క్షోభలో తల్లిదండ్రుల జీవితం.
నమ్మకు పైన మెరుగులు
తలవంచకు కన్నీళ్లకు
విజయ పయనం సాగించు
నిజమైన ప్రేమకు అంకితం అవ్వు.
జీవితం విలువ తెలుసుకో
తల్లిదండ్రుల ప్రేమను అర్దం చేసుకో
నువ్వు సాధించాల్సిన విజయం గుర్తుంచుకో
నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి
***